యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ‘ఇజం’
‘పటాస్’తో చాలా కాలం తరువాత హిట్ కొట్టిన టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్. ఈ నందమూరి యంగ్ హీరో మాస్ బాట పట్టి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇజం’ సినిమాలో నటించాడు. గతంలో టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌ను సిక్స్ ప్యాక్‌లో చూపించిన పూరీ ఈ మూవీ కోసం కళ్యాణ్ రామ్‌తో సిక్స్ ప్యాక్ చేయించాడు కూడా. అయితే ఈ చిత్రంలో ఎక్కువ మార్కులు హీరోయిన్ అతిధి ఆర్య కొట్టేసినట్లు తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. టాలీవుడ్‌కు తన చిత్రాల ద్వారా పూరీ ఇప్పటి వరకూ పరిచయం చేసిన వారిలో ఎక్కువ మార్కులు ఈ అమ్మాయికే పడ్డట్లు తెలుస్తోంది.
Categories

Recent Posts

