యూపీలో మారుతున్న రాజకీయ సమీకరణలు
లక్నో, అక్టోబర్ 26: ఉత్తప్రదేశ్‌లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ కుటుంబంలోను పార్టీలోను విబేధాలు తలెత్తడంతో రానున్న ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీ అధినేత ములాయం సింగ్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్,ఆర్ఎల్డి పార్టీలతో పొత్తుకు ములాయం సింగ్ ప్రయత్నిస్తున్నారు. ఈ దశలో రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ, ముఖ్యమంత్రి అనుకూల వర్గం ములాయం వర్గంగా ఇప్పటికే చీలిపోయింది .ములాయం తమ్ముడు, ముఖ్యమంత్రి అఖిలేష్ బాబాయ్ శిల్పాల్ యాదవ్ వర్గాల మధ్య తీవ్ర విబేధాలు నెలకొన్నాయి. తాజాగా బుధవారంనాడు ముఖ్యమంత్రి అఖిలేష్ అనుచరుడు పవన్ పాండేను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ రాష్ట్ర అధ్యక్షుడైన శివపాల్‌యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను మంత్రి పదవి నుండి కూడా తొలగించాలని శివపాల్‌యాదవ్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఒకవైపు తన తండ్రి ములాయం సింగ్ బాబాయ్ శివపాల్‌ను, మరో నేత అమర్‌సింగ్‌ను అక్కున చేర్చుకోవడం ముఖ్యమంత్రికి రుచించడం లేదు. శివపాల్ యాదవ్ వర్గీయులపై ముఖ్యమంత్రి కఠిన వైఖరి తీసుకోవడం పదవుల నుంచి తొలగించడం వంటి చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి తీరు నచ్చని శివపాల్ తన అన్న పార్టీ అధినేత ములాయంతో చర్చించి ముఖ్యమంత్రి వర్గంపై పైచేయి సాధించారు. పార్టీలో సయోధ్య కుదిర్చేందుకు ములాయం ప్రయత్నించిన్నప్పటికీ సద్దుబాటు జరిగే పరిస్థితులు కానరావడం లేదు. ఈ పరిణామాలు ఇలా కొనుసాగుతుండగా ముఖ్యమంత్రి అఖిలేష్ బుధవారం గవర్నర్ రాంనాయక్‌తో సమావేశమయ్యారు. అరగంటకుపైగా సాగిన వీరి భేటీతో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. అఖిలేష్ పదవికి రాజీనామా చేస్తారనే ఉహాగానాలు వెలువడ్డాయి. గరవ్నర్, ముఖ్యమంత్రి భేటీ వివరాలు బయటకు రాలేదు. నలుగురు మంత్రుల ఉద్వాసనపై తాజాగా రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీలో బలాబాలు ఇరత అంశాలపై వీరివురి మధ్య చర్చ జరిగి ఉండవచ్చునని తెలుస్తోంది. ములాయం సింగ్ కుటుంబ రాజకీయాలు కీలక మలుపుతు తిరుగుతున్న వాతావరణం కనిపిస్తోంది. అసలు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్‌వాది పార్టీలో తలెత్తిన అంతర్గత కుమ్ములాటలు ఇప్పట్లో చల్లారేలా లేవు. తమ కుటుంబం, పార్టీ ఐక్యంగా ఉందని పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, రాష్ట్ర పార్టీ నాయకుడు శివపాల్ యాదవ్ సమక్షంలో ప్రకటించి 24 గంటలు కూడా కాకముందే బుధవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు, రాష్ట్ర మంత్రి తేజ్ నారాయణ్ పాండే అలియాస్ పవన్ పాండేను పార్టీ నుంచి బహిష్కరించారు. ములాయం సింగ్ యాదవ్ అనుచరుడు, ఎమ్మెల్సీ ఆశు మాలిక్‌పై పార్టీ సమావేశంలో చేయిచేసుకున్నందుకుగాను పార్టీ క్రమశిక్షణా రాహిత్యం కింద పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తూ శివపాల్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు లేఖ కూడా రాశారు. తాజా పరిణామం నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ హడావుడిగా రాష్ట్ర గవర్నర్ రామ్‌నాయక్‌ను కలసుకోవడంతో పార్టీ చీలిపోతుందన్న ఊహాగానాలు మళ్లీ బయల్దేరాయి. పార్టీ చీలిపోతే అటు ములాయం, శివపాల్ యాదవ్ వర్గానికే కాకుండా ఇటు అఖిలేష్ యాదవ్ వర్గానికి కూడా కోలుకోని నష్టం జరుగుతోందని, అలాంటప్పుడు పార్టీపైనా ఆధిపత్యం కోసం అధికారం కోల్పోయే ప్రమాదాన్ని ఎవరు మాత్రం కొని తెచ్చుకుంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సమాజ్‌వాది పార్టీకి ఓ రూపు తీసుకొచ్చి అధికారం పీటంపై కూర్చోపెట్టడం వెనక ములాయం సింగ్ యాదవ్‌తోపాటు శివపాల్ యాదవ్ పాతికేళ్ల కృషి ఉంది. అలాంటి పార్టీని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా తమ మీద ఉందని వారు భావిస్తున్నారు. అయితే పార్టీ పట్టింపులు, పంతాలతో నిమిత్తం లేకుండా రాష్ట్రాన్ని అభివద్ధి పంథాలో నడిపించాలనే ఉద్దేశంతో అఖిలేష్ యాదవ్ వర్గం ముందుకు పోతోంది. ఈ తరుణంలో పార్టీ వృద్ధ నాయకులు తీసుకుంటున్న చర్యలు తమకు ప్రతిబంధకం అవుతున్నాయని ఆ వర్గం భావిస్తోంది. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా ములాయం, శివపాల్ యాదవ్ ఆధ్వర్యంలో జరగడంతో, రానున్న ఎన్నికల్లో ఈసారి తన ఆధ్వర్యంలోనే అభ్యర్థుల ఎంపిక జరగాలనే లక్ష్యంతో పార్టీపైనా అఖిలేష్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. యువతరం మద్దతు కలిగిన అఖిలేష్ వృద్ధతరమే దారికొస్తుందని భావించారు. కానీ రావడం లేదు. ఇరువర్గాలు ఒకరిపై, ఒకరు వేటు వేసుకుంటూనే ఉన్నాయి. నిజంగా పార్టీ విడిపోయినట్లయితే సమజ్‌వాది పార్టీ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పార్టీకి అండగా నిలుస్తున్న యాదవులు, ముస్లింలు పార్టీకి దూరం అవుతారని, బీజేపీని అడ్డుకోవాలనే ఉద్దేశంలో ముస్లింలు బహుజన సమాజ్ పార్టీకి వెళతారని, యాదవ్‌లు బీజేపీవైపు వెళతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే రాహుల్‌తో ఉన్న సత్సంబంధాలను ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీతో తన వర్గం కలసి పోటీ చేస్తే రానున్న ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని, అలా జరిగినట్లయితే తన పార్టీలో తాను తిరుగులేని యువనేత ఎదుగుతానని అఖిలేష్ భావిస్తున్నారు. అయినా ఆయన గవర్నర్‌తో ఎలాంటి చర్చలు జరిపారనే విషయంపై ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
భాతర్-న్యూజిల్యాండ్‌ల మధ్య ధ్వైపాక్షిక ఒప్పందం
ఉగ్రవాదంపై పోరాటంలో అంతా ఏకమవ్వాలి: మోదీ పిలుపు
న్యూఢిల్లీ, అక్టోబర్ 26: ప్రపంచంలో శాంతిభద్రతలకు ఉగ్రవాదం సవాల్‌గా మారుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఉగ్రవాదాన్ని కుదముట్టించేందుకు ప్రపంచ దేశాలన్ని ఏకతాటిపైకి రావాలని ఉద్ఘాటించారు. బుధవారం న్యూజిల్యాండ్ ప్రధాని జాన్‌కి, ప్రధాని మోదీతో సమావేశయ్యారు. ఇరు దేశాల ప్రధానుల భేటీ సందర్భంగా ఉభయ దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఉభయ దేశాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. ఫాసిఫిక్ దివుల, దేశాల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగు పడాలని మోదీ ఆకాంక్షించారు. టెక్నాలజీ రంగంలో న్యూజిల్యాండ్ భారత్‌తో భాగస్వామి కావాలని అన్నారు. ప్రపంచానికి సవాల్ విసురుతున్న ఉగ్రవాదంపై పోరాటంలో అంతా ఎకమవ్వాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రస్తుతం భారత్ న్యూజిల్యాండ్ దేశాల మధ్య నాల్గవ క్రికెట్ మ్యాచ్ జరుగుతుందని మోదీ అన్నారు. ఇదే సమయంలో ఉభయ దేశాల మధ్య కీలకమైన రంగాల్లో ధ్వైపాక్షిక ఇప్పందాలు కుదరడం సంతోషమని మోదీ అన్నారు. పండుగ సమయంలో న్యూజిల్యాండ్ ప్రధానికి స్వాగతం పలకడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఇదిలా ఉండగా భారత న్యూజిల్యాండ్ మధ్య బుధవారం పలు ధ్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా రక్షణ సైబర్ ఆహార శుద్ధి, పాల ఉత్పత్తి రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. అలాగే రక్షణ సైబర్ నేరాలు, భద్రత రంగాలపై కూడా ఒప్పందాలు కుదిరాయి. భద్రత సైబర్ నేరాలకు సంబంధించి నిఘా సమాచారంపై ఉభయ దేశాల మధ్య పరస్పర సహాకారానికి ఒప్పందం జరిగింది.
మాజీ సీఎం యడ్డూరప్పకు సీబీఐ క్లిన్‌చిట్
న్యూఢిల్లీ, అక్టోబర్ 26: కర్ణాకట రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్ యడ్డూరప్పకు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. బళ్లారి మైనికంగ్ కేసుకు సంబంధించి యడ్డూరప్పను కోర్టు నిర్దోశిగా ప్రకటించింది. ఆయనతోపాటు మరో నలుగురికి కూడా ఈ కేసు నుండి విముక్తి లభించింది. బళ్లారిలో అక్రమంగా జరుగుతున్న మైనింగ్ వ్యవహారాల్లో యడ్డూరప్పకు ప్రమేయం ఉందుంటూ అప్పట్లో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఆయనపై అభియోగాలు నమోదు చేసి దర్యాప్తు చేసింది. వచ్చిన అభియోగాలు కొట్టి వేస్తూ ఆయనను నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. కోర్టు తీర్పుపై యడ్డూరప్ప స్పందిస్తూ హర్షం ప్రకటించారు. ఎకట్టకేలకు న్యాయం గెలిచిందని యడ్డూరప్ప అన్నారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే అప్పట్లో తనపై కుట్రలు చేసి కేసుల్లో ఇరికించారని అన్నారు. ఆలస్యమైనప్పటికీ తనకు న్యాయం జరిగినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు.


