యూరీ ఉగ్రవాద దాడి మృతులకు నివాళి
- 65 Views
- wadminw
- September 21, 2016
- తాజా వార్తలు
ఏలూరు, సెప్టెంబర్ 21 (న్యూస్టైమ్): జమ్మూ, కశ్మీర్ పరిధిలోని యూరీ సెక్టారులో ఉగ్రవాదులు దాడిలో మరణించిన 18 మంది సైనికులకు పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్తు ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ప్రభుత్వవిప్ అంగర రామ్మెహనరావు నివాళులర్పించారు. స్ధానిక జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో బుధవారం జరిగిన జడ్పి స్ధాయి సంఘ సమావేశంలో యూరీలో ఉగ్రవాదుల దాఢిలో మరణించిన 18 మంది సైనికులకు నివాళులర్పిస్తూ కొంత సేపు మౌనం పాటించారు. ఈసందర్భంగా జడ్పి ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ ఉగ్రవాదులు సైనికులపై దాఢి చేసి హతమార్చడం అత్యంత హేయమైన చర్య అన్నారు.
ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా దానిని తుదిముట్టించవలిసిందేనన్నారు. ప్రభుత్వ విప్ అంగర రామ్మెహనరావు మాట్లాడుతూ సైనిక స్ధావరాలపై దాడిచేసి 18 మంది వీర జవాన్లను మట్టుపెట్టడం దుర్మార్గమైన చర్య అన్నారు. భారతసైనికులకు దేశ ప్రజల మద్ధతు పూర్తిగా ఉందన్నారు. భారతసైనికులకు మనమంతా సంఘీభావంగా ఉండవలసిన సమయమన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల దాడిలో మరణించిన 18 మంది సైనికులకు సమావేశం జోహార్లు అర్పించింది. ఈ కార్యక్రమంలో జడ్పి వైస్ ఛైర్మన్ చింతల వెంకటరమణ, జడ్పి సిఇఓ డి. సత్యనారాయణ, పలువురు జడ్పిటిసిలు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


