రబీ కోసం యంత్రాంగం సన్నద్ధం
నెల్లూరు, అక్టోబర్ 4 (న్యూస్‌టైమ్): ఈ ఏడాది పుష్పలంగా వర్షాలు కురవడంతో రబీ సీజన్లో పంటలుసాగు చేసుందుకు అటు రైతాంగం, ఇటు వ్యవసాయానికి నీటిని సరఫరా చేసేందుకు ఇటు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. గత ఏడాదిలో సుమారు 5 లక్షలపై చికులు ఎకరాలకు నీటిని సరఫరా చేయగా పెద్ద ఎత్తున రైతులు లాభాలను గడించారు. ఎన్నడూ లేని విధంగా రబీ సీజన్లో రైతులు అధిక దిగుబడని సాధించగా రబీ సీజన్ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమైంది. ఈ సీజలో వ్యవసాయ బావుల కింద జలాశయాల ద్వారా రైతులు ఆహార పంటలైన వరి, వాణిజ్య పంటలైన వేరుశనగ, పొగాలకు, పత్తి, నిమ్మ, మినుములు తదిరతరాలను పండించడానికి సమాత్తమవుతున్నారు.
వాస్తవానికి ఈ ఏడాది జూన్, జూలై నెలలో అనుకుంత వర్షాలు పడకపోవడంతో రబీ సీజన్లో నీటిని సరఫరా చేయడం సాధ్యం కాదని భయపడిన రైతులకు ఆగస్టు, సెప్టెంబర్ నెలలో రాయలసీమ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు పెన్నా నదికి ఉప నదులైన పాపాగి&ఒజ, కగిలేరు, నిప్పుల వాగ తదితరాల ద్వారా నీరు సోమశిల జలాశయంలోకి వచ్చి చేరడంతో ప్రస్తుతం ఈ రబీ సీజన్ నీరు పుష్కలంగ లభమైనట్లు అయింది.
ఇరిగేషన్ శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం పెన్నా నదిలో 18 టీఎంసీల నీరు నిల్వ ఉండగా 7 లక్షల ఎకరాలకు ఈ రబీ సీజన్లో నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. సెపెక్టంబర్ పూర్తయి అక్టోబర్ ప్రారంభమవుతుండగా, ఈ నెల వచ్చే నెలలో నెల్లూరు జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో సోమశిల జలాశయంలోకి మరింత సమృద్ధిగా నీరు చేరి రైతులు ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగంగ పరివాహక ప్రాంతంలోని సూళ్లూరుపేట, నాయకుడుపేట, తడ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే రైతులు రబీ సాగుకు సంబంధించి నార్లుపోయడం కూడా జరిగింది. దీంతో ఈ ఏడాది రబీ సీజన్ కూడా రైతులకు ఆశాజనకమైన ఫలితాలను ఇవ్వనుంది.
విద్యుత్ కార్మికుల దీక్షలు
నెల్లూరు, అక్టోబర్ 4 (న్యూస్‌టైమ్): దీర్ఘకాలికంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలో పని చేస్తున్న షిప్ట్ ఆపరేటర్లు, మీటరు రీడర్లు యూనైటెడ్ ఎలక్టిస్రిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యుత్‌భవన్ వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. యూనైటెడ్ ఎలక్టిస్రిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు దుగ్గిరాల సూరిబాబు మాట్లాడుతూ షిప్ట్ ఆపరేటర్లకు 4 నెలల నుంచి, మీటరు రీడర్లకు 7 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదన్నారు. జీతాలు లేకుండా కార్మికులు నెలలు, నెలలు ఎలా పని చేస్తారని ప్రశ్నించారు. అతి తక్కువ వేతనాలతో ప్రాణాలు ఫణంగా పెట్టి విద్యుత్ సంస్థ అభివృద్ధికి కాంట్రాక్ట్ కార్మికులు కృషి చేస్తున్నాప్పటికీ అధికారులు చిన్నచూపు చూడటం దారుణమన్నారు. కార్మికులకు కాంట్రాక్టర్లు జీతాలు ఇవ్వకపోతే అధికారులు ఏమి చేస్తున్నారని నిలదీశారు. జీతాలు అమలు చేయలేని సీఎండీ ఉత్తర్వులు దేనికని ఎద్దేవా చేశారు. సంఘం జిల్లా కార్యదర్శి జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ పర్మినెంట్ ఉద్యోగుల కన్వర్షన్లు ఇవ్వడంలోనూ జాప్యం జరుగుతుందన్నారు. ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా స్పందన లేదన్నారు. యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సుధాకర్‌రావు, ఎస్పీడీసీఎల్ కమిటీ అధ్యక్షుడు ఖాజావలి, జిల్లా నాయకులు నాగయ్య, పెంచలప్రసాద్, జీఎస్ బాబు, రామయ్య, పి.కృష్ణ, హజరత్ వలి, నాని, బాలకృష్ణ పాల్గొన్నారు.
సీఎంఆర్ ఇవ్వని వారిపై కఠిన చర్యలు: జేసీ
నెల్లూరు, అక్టోబర్ 4 (న్యూస్‌టైమ్): కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరా చేయని రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాలులో వివిధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. సీఎంఆర్ సరఫరా చేయకుండా ఇబ్బందులు పెడుతున్న రైస్ మిల్లర్లపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ నెల 15వ తేదీలోపు వంద శాతం సీఎంఆర్ సరఫరా చేయాలన్నారు. నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించా. డీఎస్ఓ టి. ధర్మారెడ్డి, డీఎం కొండయ్య, ఏఎస్ఓలు, సీఎస్డీటీలు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. ప్రజలు సమస్యలపై అందజేసిన వినతులను సత్వరమే పరిష్కరించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. డయల్ యువర్ కలెక్టర్‌కు వచ్చే ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి పరిష్కరించాలన్నారు. పరిష్కరించిన వాటిని మీ–కోసం ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. సమావేశంలో జేసీ–2 రాజ్‌కుమార్, డీఆర్వో మార్కండేయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


