రామ్ చరణ్ ‘ఇండియన్ బ్రాడ్ పిట్’
- 39 Views
- admin
- May 16, 2023
- తాజా వార్తలు సినిమా
ఇక ఆర్ఆర్ఆర్ సినిమాను తాను చూడలేదని ప్రియాంక చోప్రా చెప్పింది. తాను నటించిన లేటెస్ట్ హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ రీసెంట్గా రిలీజైంది. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్నేషనల్ మీడియాతో ముచ్చటించింది.తనకు సమయం ఉండటం లేదని, చాలా సినిమాలు చూడలేకపోయానని వెల్లడిరచింది. అయితే కొన్ని టీవీ షోలను చూశానని చెప్పింది. కానీ ఆస్కార్ అవార్డుల సందర్భంగా నిర్వహించిన ఆర్ఆర్ఆర్ ప్రచారంలో ప్రియాంక కూడా పాలుపంచుకోవడం గమనార్హం. అప్పట్లో చరణ్, ఉపాసన దంపతులకు అమెరికాలో ఆతిథ్యం కూడా ఇచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌పై ప్రియాంకా చోప్రా ప్రశంసలు కురిపించింది. చరణ్ ను ఇండియన్ బ్రాడ్ పిట్‌గా అభివర్ణించింది. అయితే బ్రాడ్ పిట్, రామ్ చరణ్‌లో ఎవరు అందగాడనే ప్రశ్నకు బదులిచ్చేందుకు నిరాకరించింది. తాను బ్రాడ్ పిట్‌పై ప్రేమతో పెరిగానని, కాబట్టి ఆ ప్రశ్న అడగడం అన్యాయమని వ్యాఖ్యానించింది.


