రేటు పెంచిన ప్రగతి
టాలీవుడ్ నటి ప్రగతి అందరికీ సుపరిచితమే. ఇప్పటికే 100కి పైగా చిత్రాల్లో తల్లి, పిన్ని, అత్త, చిన్నమ్మ వంటి పాత్రల్లో నటించి మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ‘దూకుడు’ ‘బాద్ షా’ ‘ఎఫ్2’ వంటి చిత్రాలు ఈమెలోని కామెడీ యాంగిల్ ను బయటకి తీశాయి. ఇక తాజాగా విడుదలైన ‘ఎఫ్3’ చిత్రంతో ఈమెలోని కామెడీ యాంగిల్ ను మరోసారి బయటకి తీసింది. ఈ సినిమా కూడా హిట్ అవ్వడంతో ప్రగతికి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయట. దీంతో ఈమె పారితోషికం కూడా పెంచినట్టు తెలుస్తుంది. ఇక నుండీ ఈమె చేయబోయే సినిమాలకి గాను ఒక్కో కాల్ షీట్ కు రూ.50 వేల చొప్పున డిమాండ్ చేస్తుందట. అంటే ఈమె 20 రోజులు షూటింగ్లో పాల్గొనాలి అంటే రూ.10 లక్షలు చెల్లించాలన్న మాట. ఒకవేళ 10 రోజులు అయితే రూ.5 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఒక రోజులో రెండు, మూడు సినిమాల షూటింగ్ లలో పాల్గొంటూ ఉంటారు. ఆ లెక్కన చూసుకుంటే ప్రగతి నెల సంపాదన గట్టిగానే ఉంటుందని అంచనా..!