రేపు అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినం
- 244 Views
- wadminw
- November 24, 2016
- అంతర్జాతీయం
నేటి సమాజంలో స్త్రీలు అనేక సామాజిక, ఆర్ధిక, రాజకీయ, విద్యాపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. గృహ హింసలు, స్త్రీలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. అత్మనూనతా భావానికి లోనై స్త్రీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటిన్నింటినీ అరికట్టే ప్రయత్నంలో 1999 డిసెంబరు 17వ తేదీన ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని చేసింది. ప్రతి సంవత్సరం నవంబరు 25న స్త్రీల హక్కుల పరిరక్షణ, స్త్రీ హింసా వ్యతిరేక దినంగా పాటించాలని ఈ తీర్మానం (తీర్మానం 54/134) సారాంశం. చారిత్రాత్మకంగా ఈ దినాన్ని 1960లో డొమైన్ రిపబ్లిక్లో రాజకీయ కార్యకర్తలైన మిరాబల్ సిస్టర్స్ హత్య అధారంగా స్త్రీ హింసా వ్యతిరేక దినంగా పాటించడం జరిగినది. ఈ హత్యలు డొమైన్ రిపబ్లిక్ నియంత అయిన రాఫ్హీల్ ట్రుజిల్లో(1930?1961)చే 1981లో అజ్ఞాపించబడినవి. ఉద్యమకారులు నవంబరు 25న స్త్రీ హింసా వ్యతిరేకత గూర్చి అవగాహన కల్పించాలని నిర్ణయించారు.
డిసెంబరు 17, 1999న ఈ దినాన్ని అధికారికంగా ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. ఐక్యరాజ్య సమితి అంతర పార్లమెంట్ సమాఖ్య అన్ని ప్రభుతాలను, అంతర్జాతీయ సంస్థలకు, ఎన్.జి.ఒలకు ఆ రోజున అంతర్జాతీయ కార్యక్రమంగా మహిళలపై జరుగుతున్న హింసా వ్యతిరేక దినంగా పాటించి కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ప్రోత్సహించింది. ఉదాహరణకు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ఫండ్ ఫర్ వుమెన్ ఈ దినాన్ని ప్రతి సంవత్సరం పరిశీలించి కొన్ని సలహాలను యితర సంస్థలకు ఇవ్వడం జరుగుతుంది. 2012లో ఈ దినాన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి మూన్ సందేశంతో ప్రారంభించబడినది.
2013లో అస్ట్రేలియాలోని ఆన్లైన్ మీడియాలో ఒక ఆర్టికల్ విడుదలైనది. ఈ ఆర్టికల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రసారంకాబడింది. ఈ ప్రసారంలో సాధారణ అస్ట్రేలియన్ నమ్మకం ప్రకారం ఆస్ట్రేలియన్ మహిళలు ఇతర దేశాల కంటె తక్కువ రక్షింపబడుతున్నారని. ఆస్ట్రేలియాలోని ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఆస్ట్రేలియాలోని ప్రతి ముగ్గురు మహిళలలో ఒకరు జీవితంలో ఒకసారైనా హింసకు గురవుతూ ఉన్నారు. 23 శాతం నుండి 28 శాతం మహిళలు లైంగిక హింస లేదా భావోద్వేగ హాని కలిగియున్నారని తెలుస్తుంది. ఈ గణాంకాలను 2005లో ప్రచురింబబడిన ఆధారంగా తీసుకోబడింది.


