రైతులపై విక్ష చూపుతున్న ప్రభుత్వం
- 98 Views
- wadminw
- January 2, 2017
- Home Slider రాష్ట్రీయం స్థానికం
ఆదిలాబాద్: రైతులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసి రైతులను మరింత ఆర్థికంగా దెబ్బతీస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. నకిలీ విత్తనాలతోపాటు నకిలీ విత్తనాల సరఫరాలో అధికారుల తప్పిదంతోపాటు మంత్రి హస్తం ఉందని ఆయన ఆరోపించారు. పంట ఉత్పత్తులు చేతికి వచ్చిన వాటిని కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు.
సోయా పంటకు మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం ఆ పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లాలో మంత్రి కుటుంబ సభ్యులు, వారి అనుచరుల ఆగడాలు మితిమీరడంతోపాటు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజా, రైతు, విద్యార్థి వ్యతిరేక విధానాలకు అవలంభిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి భవిష్యత్తులో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.


