రోజాకి బుక్ అయిన సుడిగాలి సుధీర్!
తెలుగు బుల్లితెరపై ఎంతో పాపులారిటీ సంపాదించిన జబర్ధస్త్ కామెడీ షో ఇప్పుడు భారత దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజల మన్ననలు అందుకుంటుంది. ప్రతి ఒక్కరికీ మంచి ఎంట్రటైన్మెంట్ ఇస్తున్న ఈ కామెడీ షో ద్వారా ఎంతో మంది ఔత్సాహికులు మంచి లైఫ్ అందుకున్నారు. జబర్ధస్త్ కామెడీ షోతో యాంకర్లుగా వచ్చిన అనసూయ, రష్మీ ఏకంగా సినిమాల్లో చాన్సులు దక్కించుకున్నారు. ఇందులో నటించిన కమెడియన్లు వెండితెరపై మంచి ఫామ్‌లో ఉన్నారు.
ఇక ఈ ప్రోగ్రామ్‌కి మొదటి నుంచి జడ్జీలుగా మెగా బ్రదర్ నాగబాబు, నటి రోజా లు వ్యవహరిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా పరిచయం అయిన సుడిగాలి సుధీర్ ఇప్పుడిప్పుడే మంచి ఫామ్‌లోకి వస్తున్నాడు. సినిమాల్లో కూడా చాన్సులు దక్కించుకుంటున్న సుధీర్‌పై అమ్మాయిలను ఫ్లర్ట్ చేస్తాడన్న రూమర్లు బాగా ఉన్నాయి. తాజాగా ఓ ప్రోగ్రామ్‌లో జబర్దస్త్ జడ్జి, సినీ నటి, ఎంఎల్ఏ రోజా సీరియస్ సుధీర్‌కి వార్నింగ్ ఇవ్వడంతో మనోడు బిక్కమోహం వేసుకున్నాడు.
అసలు విషయానికి వస్తే, చంటి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ కార్యక్రమానికి నాగబాబు, రోజా గెస్ట్లుగా వచ్చారు అయితే ఆ షోలో ఎవరికైనా కాల్ చేసి వాళ్ళను బకరాలను చేయాలి దాంతో రోజా సుడిగాలి సుధీర్‌కు కాల్ చేసి నువ్వొక అమ్మాయిని మోసం చేసావని నా దగ్గరకు వచ్చింది అంటూ సుధీర్‌ని నిలదీసింది దీంతో మనోడికి అసలు విషయం తెలియక టెన్షన్లో పడ్డాడు. అంతే కాదు మేడం అంటూ బ్రతిమిలాడటం మొదలు పెట్టాడు. ఇలా సుధీర్‌ని చాలా టెన్షన్ పెట్టిన రోజా అబ్బే! ఇదంతా వట్టిదే అంటూ చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు.
మొత్తానికి మనోడి బలహీనత ఎంత పనిచేసిందో! తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షోలో అనసూయ యాంగర్‌గా బాగా పాపులారిటీ సంపాదించింది. దీంతో ఈ అమ్మడు ఇతర చానల్స్‌లో యాంకర్‌గా నిర్వహిస్తూనే వెండితెరపై మెరిసిపోతుంది. ఇక అనసూయ తర్వాత జబర్ధస్త్ కామెడీ షోకి రష్మీ ఎంట్రీ ఇచ్చింది. రష్మీ కూడా అనసూయ కన్నా రెండు ఆకులు ఎక్కువే చదివింది..తనకంటే హాట్ హాట్‌గా కనిపిస్తూ కుర్రకారు మనసు దోచింది. అంతే కాదు ఈ అమ్మడు కూడా వెండి తెరపై హీరోయిన్గా వెలిగిపోతుంది.
అయితే జబర్ధస్త్ కామెడీ షోలో సుడిగాలి సుధీర్‌కి రష్మీ మధ్య అదేదో ఉందంటూ గత కొంత కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢీ జోడి ప్రోగామ్లో సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ ఎప్పటికైనా ఢీ జోడి అయ్యేలోపు ఒక్కసారైనా డాన్స్ చేయాని తన మనసులోని కోరికటను బయట పెట్టాడు. అంతటితో ఆగకుండా రష్మీతో వెకిలి చేష్టలు కూడా చేశాడు. రష్మి భుజంపై చేయ్యేసి వేసి నీ కోరిక ఏమిటో కూడా నాకు తెలుసు అంటూ వెటకారంగా అనడంతో చిర్రెత్తిపోయిన రష్మి ఒక్కసారిగా సుడిగాలి సుధీర్‌ని పక్కకి నెట్టేసింది.
తనతో హద్దు మీరి ప్రవర్తించిన సుడిగాలి సుధీర్‌కు రష్మి సీరియస్‌గా వార్నింగ్ కూడా ఇచ్చింది. తమరు కాస్త గ్యాప్ మెయింటేన్ చేస్తే బాగుంటుందని ఛాన్స్ దొరికితే చెయ్యి పెడతావ్ అంటూ తన భుజంపై చెయ్యేసిన అతన్ని ఇక్క ఉదుటన పక్కకి తోసేసింది. సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి మధ్య జరిగిన ఈ ఘటన చూసి యాంకర్ ప్రదీప్‌తో పాటు అంతా షాకయ్యారు. అయితే ఈ విషయం కాస్త సీరియస్ కాకుండా జడ్జీలు పగలబడి నవ్వినట్లు చేయడంతో గొడవ పక్కకు మళ్లింది.


