లారెన్స్‌ని తిట్టిన తెలుగు హీరోకి షాకింగ్!
డాన్స్‌పై ఏ మాత్రం అవగాహన ఉన్నవారికి రాఘవ లారెన్స్ అంటే పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇక సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీపై అవగాహన ఉన్నవారికి సైతం రాఘవ లారెన్స్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టి దర్శకులుగా ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకున్న అతి తక్కువ మందిలో రాఘవ లారెన్స్ ఒకరు. ప్రస్తుతం ప్రభుదేవా. రాఘవ లారెన్స్ మాత్రం కొరియోగ్రఫర్స్‌గా ఉంటూ డైరెక్టర్స్‌గా కెరీర్‌ని సక్సెస్ ఫుల్‌గా లీడ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగులో రాఘవ లారెన్స్ డైరెక్టర్‌గా పలు సినిమాలు వచ్చాయి.
అయితే అందులో బాక్సాపీస్ వద్ద సక్సెస్ సాధించినవి కొన్ని మాత్రమే ఉన్నాయి. అలాగే బాక్సాపీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్ అయిన సినిమాలు అదే సంఖ్యలో ఉన్నాయి. అయితే డిజాస్టర్ సాధించిన చిత్రాల ఎఫెక్ట్ రాఘవ లారెన్స్‌పై ఎక్కువుగా పడింది. దీంతో రాఘవ లారెన్స్‌తో చిత్రాలను నిర్మించకుడదు, నటించకుడదు అంటూ తెలుగు ఇండస్ట్రీ నిర్ణయించుకుంది. ఇక తాజాగా ఓ మూవీకి సంబంధించిన షూటింగ్లో టాలీవుడ్‌కి చెందిన ఓ టాప్ హీరో. రాఘవ లారెన్స్ గురించి చులకగా మాట్లాడాడు అని తెలిసింది.
అయితే తమిళ టెక్నిషయన్స్ ముందు ఆ హీరో గురించి ఆ విధంగా మాట్లాడటంతో ఆ తమిళ టెక్నిషన్స్ వెంటనే ఆ హీరోకి గట్టి సమాధానం చెప్పారు. రాఘవ లారెన్స్ సంపాదించిన దాంట్లో ఎక్కువ శాతం సమాజసేవ కోసమే ఖర్చు పెడతారని చెప్పుకొచ్చారు. అలా రాఘవ లారెన్స్ నుండి సహాయం అందుకున్న వారిలో ఆ తమిళ టెక్నిషియన్ ఒకరు. ఇంకోసారి రాఘవ లారెన్స్ గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదని గట్టిగానే చెప్పటంతో.తెలుగు హీరో కొద్దిగా తగ్గాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ఇక తాజాగా రాఘవ లారెన్స్ అనారోగ్యం బారిన పడిన చిన్న పిల్లల వైద్యంకి భారీగా ఖర్చుచేస్తున్నారని తెలిసింది. ఇప్పటివరకూ లారెన్స్ సంస్థ నుండి 131 హార్ట్ సర్జరీలు జరిగాయని తెలిసింది.
అందుకే తమిళనాడు వాళ్ళకి రాఘవ లారెన్స్ అంటే ఎంతో ఇష్టం అని అంటారు. ఇదిలావుండగా, తెలుగు ఇండస్ట్రీలోకి మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్ మొదటి చిత్రం ‘చిరుత’. ఈ చిత్రం అనుకున్న స్థాయిలో పెద్ద విజయం సాధించలేదు. ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర చిత్రం ఆల్ టైమ్ రికార్డుల మోత మోగించింది. అయితే ఈ చిత్రంలో ఓ ప్రత్యేకత ఉంది. మోగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఫస్ట్ టైమ్ మగధీర చిత్రంలో కనిపించారు. తన కుమారుడితో కలిసి స్టెప్పులేసి మెగా అభిమానులను ఉర్రూతలూగించారు. అయితే ఇప్పుడు అదే సీన్ మళ్లీ రిపీట్ అవుతుందట.
కాకపోతే ఇప్పుడు తండ్రి చిత్రంలో తనయుడి డ్యాన్స్‌తో… అవునండీ! మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఖైదీ నెం.150 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ కోసం స్పెషల్‌గా దర్శకులు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్‌ని కంపోజ్ చేయిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పాట కోసం మొదట కెథరిన్ని తీసుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆమె ప్లేస్‌లో లక్ష్మీరాయ్‌ని తీసుకున్నారట. ఇప్పటికే ఈ అమ్మడు లారెన్స్‌తో కాంచన, పవన్ కళ్యాన్‌తో సర్ధార్ గబ్బర్ సింగ్‌లో స్టెప్పెలేసింది.
ప్రస్తుతం లారెన్స్ ఈ పాట కంపోజ్ చేస్తున్నారట. ఇందులో రెండు స్పెషల్స్ ఉన్నాయి. ఒకటి గతంలో చిరు ఫేమస్ స్టెప్పు వీణ డ్యాన్స్ మరొకటి చిరు, లక్ష్మిరాయ్తో పాటు రాంచరణ్ కూడా సెకండ్ల డ్యాన్స్ బిట్ ఒకటి ఉందట. ఇప్పటకే లారెన్స్ మాష్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులనే చరణ్ ప్రాక్టీస్ చేసి రెడీగా ఉన్నాడట. ఇవాళ కాని రేపు కాని ఈ బిట్‌ను షూట్ చేస్తారని తెలుస్తోంది. ఈ మధ్యనే బ్రూస్ లీ సినిమాలో డాడ్‌తో కలసి ఏదో ఒక చిన్న యాక్ట్ చేసిన చరణ్ ఇప్పుడు ఈ డ్యాన్స్ ముచ్చట కూడా తీర్చుకుంటున్నాడన్న మాట.


