లెక్కల్లో ధిట్ట… లియొనార్డ్ ఆరులర్
- 106 Views
- wadminw
- September 6, 2016
- అంతర్జాతీయం
లియొనార్డ్ ఆరులర్… స్విట్జర్లాండుకు చెందిన ప్రఖ్యాత గణిత, భౌతిక శాస్త్రజ్ఞుడు. ఆయన తన జీవితంలో చాలా కాలం రష్యా, జర్మనీలలో గడిపినప్పటికీ సొంత దేశ ప్రయోజనాలను మాత్రం విస్మరించలేదు. ఆరులర్ కలన గణితం, టోపోలజీలలో చాలా ముఖ్యమైన విషయాల కనుగొన్నారు. నవీన గణిత శాస్త్రంలో ప్రత్యేకంగా విశ్లేషక గణితంలో చాలా మటుకు వ్యావహారిక పదాలను సంకేతాలను చాలా మటుకు ఆయనే ప్రతిపాదించిన వ్యక్తిగా ఆరులర్కు గుర్తింపు ఉంది. ఆరులర్ ఆతని గతి శాస్త్రం, దృశ్య శాస్త్రం/ఆప్టిక్స్, ఖగోళ శాస్త్రంలో చేసిన పరిశోధనలకు కూడా ఖ్యాతి గడించారు. ఆరులర్ 18వ శతాబ్దంలో అత్యున్నత గణిత శాస్త్రజ్ఞుడు గానే కాకుండా సర్వ కాలంలో ప్రపంచ గణితశాస్త్రజ్ఞూలలోనే మేటి అని కూడా ఖ్యాతి గడించాడు. ఆతని ఎన్నో పరిశోధనా రచనలు సుమారు 60-80 పుస్తకాలను నింపి వేసినవి.
ఆరులర్ చిత్రం ఆరవ సారి ముద్రితమైన స్విస్ 10-ఫ్రాంక్‌ల నోటుపై, అనేక స్విస్, జర్మన్, రష్యన్, తపాలా బిళ్ళలపై ముద్రితమైంది కూడా. ఖగోళ ఖండం/(ఆస్టరారుడ్) 2002 ఆరులర్ను కూడా ఆరులర్ జ్ఞాపకార్థం నామకరణం చేసారు. ఆరులర్ బేసిల్, స్విట్జర్లాండుకు చెందిన పాల్ ఆరులర్, మార్గరైట్ బ్రకర్ దంపతులకు జన్మించారు. పాల్ రిఫార్మ్డ్ చర్చిలో ఉపదేశకుడు కాగా, మార్గరైట్ ఒక ఉపదేశకుని కుమార్తె. లియొనార్డ్కు ఇద్దరు చెల్లెళ్ళు. లియొనార్డ్ బాల్యంలో చాలా భాగం రీహెన్ నగనంలో గడిచింది. పాల్ బెర్నావులీ కుటుంబానికి మిత్రుడు కావడం వలన ఆప్పటి ఐరోపాలో ఆది గణితశాస్త్రజ్ఞుడిగా ప్రఖ్యాతి గడించిన జోహాన్ బెర్నావులీ ప్రభావం కుర్ర లియోనార్డ్ పైన బాగా పడింది. లియోనార్డ్ 13 సంవత్సరాల వయస్సులో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి 1723లో తత్వ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.
అప్పుడు లియోనార్డ్ తండ్రి ప్రోద్బలంతో ఉపదేశకునిగా మారుదామని వేదాంతం, గ్రీకు భాష, హిబ్రూ భాషలు చదువుచండగా, జోహాన్ బెర్నావులీ లియోనార్డ్లో అసాధారణ గణిత శాస్త్ర ప్రతిభని గుర్తించి (లియొనార్డ్ తండ్రి) పాల్‌కు లియొనార్డ్కు గొప్ప గణిత శాస్త్రజ్ఞుడిగా భవిష్యత్తు ఉందని నచ్చచెప్పి, చదువును గణితము పైకి మళ్ళించారు. 1726లో లియొనార్డ్ శబ్దపు వేగంపై డాక్టరేటును పూర్తి చేశారు. ఆరులర్ గణిత శాస్త్రంలోని చాలా మటుకు విభాగాలలో పని చేశారు. అంటే, జామెట్రీ, కలన గణితం, త్రికోణ శాస్త్రం, బీజ గణితం, సంఖ్యా సిద్ధాంతం. 20వ శతాబ్ధంలో హంగెరీకు చెందిన పాల్ ఎర్డోస్ మాత్రమే లియొనార్డ్ అంత విస్తృతతంగా పనిచేశారని చెప్పుకోవచ్చు.


