వర్సిటీ ప్రతిష్ట పెంచే దిశగా పనిచేద్దాం: ఏయూ వీసీ
- 77 Views
- wadminw
- September 9, 2016
- తాజా వార్తలు
విశాఖపట్నం, సెప్టెంబర్ 9 (న్యూస్టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయం ప్రతిష్టను పెంచే దిశగా పనిచేయాలని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉదయం ఏయూ బోధనేతర ఉద్యోగుల సంఘం(ఏయూఇయూ) నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్సిటీ ఉద్యోగులంతా సమానమేనన్నారు. పభ్రుత్వ పరంగా విడుదల చేసే జిఓలను అమలు చేయడంలో ఎటువంటి ఆలస్యం చేయమన్నారు. ప్రభుత్వం అందించే అన్ని వసతులను ఉద్యోగులకు కల్పించడం జరుగుతుందన్నారు. ఉద్యోగులు సత్ప్రవర్తనతో నడచుకుంటూ వర్సిటీకి మంచి గుర్తింపు తీసుకురావడానికి కృషిచేయాలని సూచించారు.విద్యార్థులు వర్సిటీకి ఎంతో మూలమని వీరికి సత్వర, సమర్ధ సేవలు అందించే దిశగా పనిచేయాలన్నారు. రెక్టార్ ఆచార్య ఇ.ఏ నారాయణ మాట్లాడుతూ వర్సిటీ అధికారులు తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని ఉద్యోగులు స్వాగతించడం మంచి పరిణామమన్నారు. భవిష్యత్తులో ఇదే విధమైన సహకారం అందించాలన్నారు.
రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ భవిష్యత్తుపై ఆశావాద దృక్పధంతో పనిచేయాలని సూచించారు. ఉద్యోగులకు అవసరమైన అన్ని వసతులను కల్పించడం జరుగుతుందన్నారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.వి రామన్ మాట్లాడుతూ మంచి ఆలోచనలతో ఉద్యోగులు ముందుకు సాగాలన్నారు. విశ్రాంత ఆచార్యురాలు శాంతమ్మ మాట్లాడుతూ సంస్థ అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో పనిచేయడం మంచి పరిణామమన్నారు.ఏయూఈయూ అద్యక్షుడు వాకా కోటి రెడ్డి మాట్లాడుతూ వర్సిటీకి మంచి పేరు తీసుకురావడానికి పాలకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి పెదిరెడ్ల అప్పలరాజు, హాస్టల్ ఉద్యోగుల సంఘం అద్యక్షుడు ఒమ్మి అప్పారావు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ ఆచార్య నాగేశ్వరరావు ఏయూఈయూ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో ఏయూఈయూ సభ్యులు, వర్సిటీ అధికారులు, ఉద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.


