విద్యుత్ ఉత్పాదనలో ఏపీ ఆదర్శం: డిప్యూటీ సీఎం
- 112 Views
- wadminw
- September 3, 2016
- తాజా వార్తలు
కాకినాడ, సెప్టెంబర్ 3 (న్యూస్‌టైమ్): విద్యుత్ ఉత్పాదనలో రాష్ట్రం ఆదర్శం– డిప్యూటీ సిఎం చినరాజప్ప కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో సౌరశక్తి విద్యుత్ కేంద్రం ప్రారంభం విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకుని రావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. శనివారంనాడు కాకినాడ రమణయ్యపేటలోని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలోరూ. 40 లక్షల వ్యయంతో చేపట్టిన 50 కె.వి. సౌమర్ధ్యం గల సౌరవిద్యుత్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో గృహ వినియోగానికి 24 గంటలు విద్యుత్ సరఫరా , అదే విధంగా వ్యవసాయానికి 9 గంటలు అందించడం జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో సౌర విద్యుత్ మరియు విండ్ పవర్ ద్వారా విద్యుత్ ఉత్పాదనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందని, స్మార్ట్ సిటీగా ప్రకటించబడిన కాకినాడ నగరంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు దశల వారీగా సౌరశక్తి వినియోగం ప్రోత్సహిస్తామని మంత్రి తెలిపారు. అదే విధంగా పై#్రవేటు వ్యక్తులు ముందుకు వస్తే సబ్సిడీ పై వారికి సౌరశక్తి ప్రోజెక్ట్ని ప్రోత్సహిస్తామన్నారు. కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన 50 కె.వి. సౌరశక్తి విద్యుత్ ప్లాంటు ద్వారా 200 యూనిట్ల విద్యుత్ సరఫరా జరుగుతుందని, దీనిలో 150 యూనిట్లు కార్యాలయానికి వినియోగించి, మిగిలిన 50 యూనిట్లు పవర్ గ్రీడ్‌కు పంపిణీ చేస్తారన్నారు.
కాలుష్య నియంత్రణ మండలి ద్వారా పరిశ్రమల ద్వారా కాలుష్యం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలుష్య మునియంత్రణ మండలి సంయుక్త ముఖ్యపర్యావరణ ఇంజనీర్ డా. బి.మధుసూదన్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో సౌరశక్తి ద్వారా ప్రస్తుతం 28 శాతం విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని, ఈ మొత్తాన్ని 42 శాతానికి పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో సౌరశక్తి విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు 46 శాతం సబ్సిడీ అందచేస్తున్నారని, ఎవరైనా 1000 స్క్వేర్ ఫీట్స్ధలం ఉంటే అక్కడ ఈ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు, జిల్లా కలక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, కాకినాడ రూరల్ ఎంఎల్ఏ శ్రీమతి పిల్లి అనంత లక్ష్మి, కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీర్ డా. రవీంద్రబాబు, నెడ్‌క్యాప్, జిఎం జి.సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.


