విద్య వ్యక్తికి శక్తిని అందిస్తుంది: ఏయూ వీసీ
- 79 Views
- wadminw
- December 15, 2016
- రాష్ట్రీయం
విశాఖపట్నం, డిసెంబర్ 14 (న్యూస్టైమ్): విద్య వ్యక్తికి అవసరమైన శక్తిని అందిస్తుందని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఉదయం ఏయూ దుర్గాబాయి దేశముఖ్ మహిళా అధ్యయన కేంద్రంలో నిర్వహించిన ‘గిరిజన యువత సాధికారత శిక్షకుల శిక్షణ’ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ యువత చదువే సర్వస్వంగా భావించాలని విద్యను అందుకుని బలవంతులుగా ఎదగాలన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ గిరిజన యువత తప్పనిసరిగా ఇటువంటి శిక్షణ తీసుకోవాలన్నారు.
నైపుణ్యాల అభివృద్ధి చేసుకోవాలన్నారు రాజీవ్ గాంధీ జాతీయ యువజనాభివృద్ధి కేంద్రం ఆచార్యురాలు వి.కాదంబరి కీలకోపన్యాసంలో మాట్లాడుతూ గిరిజన యువత సంఘటితమై బలీయమైన శక్తిగా ఎదుగుతున్నారన్నారు. వారి సాధికారత కోసమే ఈ శిక్షణ కార్యక్రమమన్నారు. హెల్త్ సిస్టం రీసెర్చి కన్సల్టెంట్ వై.అరవింద్ మాట్లాడుతూ గిరిజన యువత తమకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. నన్నవ వర్సిటీ మాజీ ఉపకులపతి ఆచార్య నిరుపారాణి మాట్లాడుతూ జీవితంలో ఎదుటివారిని గౌరవించే సంస్కారం కలిగి ఉండాలన్నారు. సంస్థ సంచాలకులురాలు ఆచార్య బి.రత్నకుమారి సదస్సు ముఖ్యాంశాలను వివరించారు.


