వినడానికి విడ్డూరమే… కానీ…
- 97 Views
- wadminw
- January 8, 2017
- Home Slider సినిమా
వినడానికి ఇది కాస్త విడ్డూరంగా ఉన్నా వాస్తవం. ఇంటి వైద్యంతో శృంగారంలో అద్బుతాలు సృష్టించవచ్చంటున్నారు నిపుణులు. జీవితంలో శృంగారం ఓ భాగం. ఈ సెక్స్ లైఫ్ బాగుంటే మనిషి మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాడు. అయితే ఈమధ్యకాలంలో శృంగార జీవితానికి దూరంగా ఉండే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. అందుకు బోలిడెన్ని కారణాలు ఉన్నాయి. అయితే ఇంటి వైద్యంతోనే శృంగార వాంఛను సంతృప్తికంరగా కొనసాగించవచ్చని సూచిస్తున్నారు వైద్యులు. ఇంటి వైద్యంలో అంజీర లేదా అత్తిపండుది కీలక భూమికట.
అత్తిపండులో ఎమినో యాసిడ్లు అధికంగా వుంటాయట. ఇవి సెక్స్ సామర్ధ్యాన్ని బాగా పెంచుతాయని పరిశోధనలు కూడా రుజువుచేశాయి. నిత్యం మహిళలు ఆరాధించే తులసిలో కూడా సెక్స్ సామర్ధ్యాన్ని పెంచే గుణాలు ఉన్నాయంటే ఆశ్చర్యమేస్తోంది. సాధారణంగా ప్రతి ఇంటిలోను తులసి చెట్టు వుంటుంది. దీనిని ఎంతో పవిత్రంగా హిందువులు ఆరాధిస్తారు. తులసి ఆకుల రసం వేడినీటిలో కలిపి తాగితే మహిళలలో కామ వాంఛ పెరగటమే కాదు జననాంగ వ్యవస్ధను శుద్ధి చేసి సంతానోత్పత్తి కూడా కలిగిస్తుందని వైద్యులు చెపుతారు.
దొడ్లో చెట్టుకు విరగ్గాసే ములగ కాడలున్నాయా? బాగా తినేయండి. అవి మీలోని వాంఛను, టెస్టోస్టిరోన్ స్ధాయిని పెంచుతాయి. విటమిన్ ఇ కూడా బాగా వుంటుంది. ఇది సెక్స్ హార్మోన్లను ప్రభావితంచేసి మీ సెక్స్ లైఫ్‌ను పెంచుతుంది. ములక్కాడ మహిళలకు, పురుషులకు కూడా సెక్స్ సామర్ధ్యం పెంచటంలో దివ్యమైన ఔషధమని ప్రాచీనకాలంనుండి చెపుతున్నారు.


