వినాయక చవితి శుభాకాంక్షలు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విజ్ఞానం, సంపద అదృష్టానికి వినాయకుడు ప్రతిరూపమని అన్నారు. విఘ్నాలకు అధిదేవుడైన వినాయకుడు రాష్ట్ర పురోభివృద్ధిలో కలిగే విఘ్నాలను తొలగించి స్వర్ణాంధ్ర నిర్మాణంలో వెన్నంటి విజయమార్గంలో నడిపించాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఇంతటి విశిష్టత కలిగిన దేవుడు విఘ్నేశ్వరుడు అవిఘ్నంగా తెలుగు ప్రజలకు సకల శుభాలు కలిగించాలని అన్నారు.
తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విజ్ఞానం, సంపద అదృష్టానికి వినాయకుడు ప్రతిరూపమని అన్నారు. సకల శుభకార్యాలు గణపతి పూజతో మొదలవుతాయని అన్నారు. తెలుగు ప్రజలకు శుభాలు కలిగించాలని ప్రార్థిస్తున్నాని అన్నారు.


