విపత్తు సమయాలలో మహిళలపట్ల ప్రత్యేక శ్రద్ద
- 72 Views
- wadminw
- September 9, 2016
- తాజా వార్తలు
విశాఖపట్నం, సెప్టెంబర్ 9 (న్యూస్‌టైమ్): విపత్తులు సంభవించిన సమయాలలో మహిళలపట్ల ప్రత్యేక శ్రద్ద చూపాల్సిన అవసరం ఉందని ఏయూ మహిళా అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య బి.రత్నకుమారి అన్నారు. శుక్రవారం ఉదయం విభాగంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హుదూద్ అనంతరం మహిళల సమస్యలపై తమ కేంద్రం అధ్యయనం జరిపిందన్నారు. వీటిని క్రోడీకరించి తీర్చిదిద్దిన పుస్థకాన్ని ఉపాధ్యాయ దినోత్సవ అవార్డుల ప్రధానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేయడం జరిగిందన్నారు. హుదూద్ అనంతరం మహిళలు తగిన రక్షణ, పోషణ సంబంధ సమస్యలను ఎదుర్కొన్నారు. తన పర్యవేక్షణలో కేంద్రానికి చెందిన టి.సాంబశివరావు, ఎం.అనిత, రవికుమార్‌లు హుదూద్ పర్యవసనానాలపై అధ్యయనం చేయడం జరిగిందన్నారు.
వీటిని ‘ద వల్లరబులిటి అండ్ జెండర్ డైమెన్షన్స్ ఇన్ హుదూద్ సైక్లోన్ డిజాస్టర్ మేనేజ్మెంట్-ఏ కేస్ స్టడీ ఆఫ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్’ పుస్తకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. హుద్‌హుద్ ముగిసిత తరువాత జిలాలలోని విభిన్న ప్రాంతాలలో మహిళలు ఎదుర్కొన్న సమస్యలు అధ్యయనం చేసామన్నారు. ప్రధానంగా సింగిల్ మదర్, వృద్ధులు, గర్భీణీ స్త్రీలు తగిన రక్షణ కోరుకున్నారన్నారు. వీరికి అవసరమైన కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఇబ్బందులు పడ్డారన్నారు. 70 శాతం పైగా మహిళలు హుద్‌హుద్ రూపంలో తీవ్ర ఇబ్బందులు పడినట్లు తమ పరిశోధనలో స్పష్టమైందన్నారు. గృహాలు దెబ్బతిన్నవారు, ఆర్ధిక సహాకం పొందిన వారు, వివిధ సంస్థలలో పునరావాసం పొందినవారితో మాట్లాడి సమాచారం సేకరించడం జరింగిందన్నారు.
హుద్‌హుద్ పర్యవసానాలు, మహిళల అవస్థలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. భవిష్యత్తులో విపత్తులు సంభిస్తే మహిళల సంరక్షణ, రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి తెలియజేసామన్నారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, ఏయూ మహిళా అధ్యయన కేంద్రంతో భవిష్యత్తులో మరిన్ని అధ్యయనాలు జరుపుతామన్నారు. ఆచార్య బి.రత్నకుమారికి అర్ధశాస్త్రం నుంచి ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డును, నగదు పురస్కారం,ప్రశంసా పత్రాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందజేశారు.


