వివేకా లేఖపై సునీతకు సీబీఐ ప్రశ్నలు
- 44 Views
- admin
- May 16, 2023
- తాజా వార్తలు
దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పలువురు సాక్షులను సీబీఐ ప్రశ్నిస్తోంది. తాజాగా ఈ హత్య కేసులో కీలకంగా భావిస్తున్న వివేకా రాసిన లేఖపై మంగళవారం వివేకా కూతురు సునీతారెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు ఆమెను పిలిపించుకుని స్టేట్మెంట్ నమోదు చేసింది సీబీఐ. మంగళవారం మరోసారి వివేకా కేసులో సునీతారెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. కోఠిలోని సీబీఐ కార్యాలయానికి సునీతను పిలిపించుకుని లేఖపై ఆరా తీశారు సీబీఐ అధికారులు. ఆమె కూడా భర్త నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.
Categories

Recent Posts

