వేడి నీళ్లతో స్నానంతో హైపర్ టెన్షన్ !
- 162 Views
- admin
- December 12, 2022
- Health & Beauty తాజా వార్తలు
వేడి నీళ్ల స్నానం నరాలకు హాయిని కలిగించినా రక్తప్రసరణపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అమెరికా డాక్టర్ హెచ్చరించారు. రక్తప్రసరణ వేగం పెంచి హైపర్ టెన్షన్ కు కారణమవుతుందని డాక్టర్ వివరించారు. చలికాలంలో వేడి నీళ్లతో స్నానం మనం తరుచు చేస్తుంటాం. అయితే, నీళ్లు కాస్త వెచ్చగా ఉంటే పరవాలేదు కానీ మరీ వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నీళ్లు మరీ వేడిగా ఉంటే చర్మంలోని తేమ పోయి పొడిబారుతుందని, జుట్టు పెరుగుదల మందగిస్తుందని చెబుతున్నారు. శరీరానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియా కూడా ఈ వేడి వల్ల నశిస్తుందని అంటున్నారు. ఫలితంగా చర్మంపై పగుళ్లు, దురద సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. తామర కూడా పెరుగుతుందని వివరించారు. స్నానానికి ఉపయోగించే నీళ్లు మరీ వేడిగా ఉంటే తల పైన రక్త ప్రసరణ వేగం తగ్గుతుందని డాక్టర్ తెలిపారు. దీనివల్ల జుట్టు పెరగుదల మందగిస్తుందని, జుట్టు రాలడం మరింత పెరుగుతుందని వివరించారు. మన చర్మంలో నుంచి సహజంగా ఆయిల్ ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మాన్ని పొడిబారకుండా, చర్మ సంబంధిత సమస్యల నుంచి కాపాడుతుంది. మరీ వేడి నీళ్లతో స్నానం చేసినా, బాత్ టబ్ లోని వేడి నీళ్లలో ఎక్కువసేపు కూర్చున్నా అందులోని వేడి వల్ల ఈ ఆయిల్ ఉత్పత్తి ఆగిపోతుంది. దీంతో చర్మం పొడిబారి, కొత్త సమస్యలు ఎదురవుతాయి.


