వైఎస్ విగ్రహాన్ని తొలగించిన అధికారులు
- 72 Views
- admin
- November 7, 2022
- తాజా వార్తలు రాష్ట్రీయం
జనసేన సభకు స్థలాన్ని ఇచ్చారనే అక్కసుతోనే వైసీపీ ప్రభుత్వం మంగళగిరి జిల్లా ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ పేరుతో కొన్ని ఇళ్ల కట్టడాలను తొలగింపు చర్యలకు పాల్పడిరదని విపక్షాలు ఆరోపించాయి. పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా వైఎస్ విగ్రహానికి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. విగ్రహం చుట్టూ రెండంచెల ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు విగ్రహానికి కాపలా కాశారు. పవన్‌కు భద్రతగా ఉండాల్సిన పోలీసులు వైఎస్ విగ్రహానికి పహారా కాశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో, అధికారులు సోమవారం వైఎస్ విగ్రహాన్ని కూడా తొలగించారు. మరోవైపు, రోడ్డు పక్కనున్న మహాత్మా గాంధీ, నెహ్రూ, అబ్దుల్ కలాం వంటి నేతల విగ్రహాలను కూడా అధికారులు తొలగించారు. అప్పుడు పక్కనే ఉన్న రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని మాత్రం కూల్చలేదు.
Categories

Recent Posts

