వైసీపీని విమర్శించే అర్హత కన్నాకు లేదు
- 101 Views
- admin
- February 24, 2023
- తాజా వార్తలు
వైసీపీని విమర్శించే అర్హత కన్నా లక్ష్మీనారాయణకు లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నైజం కన్నాది అని… బీజేపీ వాసాలు లెక్క పెట్టిన తర్వాత ఆయన టీడీపీలో చేరారని చెప్పారు. టీడీపీలో చేరడం ద్వారా ఆయన నైతిక విలువలను కోల్పోయినట్టేనని అన్నారు. రాజకీయంగా కన్నా లక్ష్మీనారాయణ చనిపోయినట్టేనని చెప్పారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తాము సహించబోమని హెచ్చరించారు. పట్టాభి విషయంలో తమ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పట్టాభి పాత ఫొటోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Categories

Recent Posts

