శరవేగంగా ‘శతమానం భవతి’ షూటింగ్
తెలుగులో డిఫరెంట్ సినిమాలను తీస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్ దిల్ రాజు నిర్మాణంలో చేస్తున్న సినిమా శతమానం భవతి. కోనసీమలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్కడ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకుందట. శర్వానంద్ అనుపమా పరమేశ్వరన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ సినిమా సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేస్తున్నాడు. సంక్రాంతి బరిలో దించేందుకు సిద్ధంగా ఉన్న దిల్ రాజు సినిమాతో మరోసారి యూత్‌ను టార్గెట్ చేస్తున్నారు.
తాత మనవడు సెంటిమెంట్‌తో రాబోతున్న ఈ సినిమాతో దిల్ రాజు వ్యూహం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. మరోవైపు, మెగా పవర్ స్టార్ రాం చరణ్ తేజ్ నటిస్తున్న తని ఒరువన్ రీమేక్ ధ్రువ సినిమా దాదాపు షూటింగ్ కంప్లీట్ కావొచ్చింది. అయితే సినిమా దసరా రేసు నుండి తప్పుకుని డిసెంబర్ 2న రిలీజ్ చేస్తున్నారు. దసరా రోజున ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తున్నారట. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ ఎంతో స్టైలిష్ లుక్‌తో కనిపించనున్నారు. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీజర్ ఈ దసరాకి రిలీజ్ చేసి సినిమా మీద అంచనాలను పెంచేయాలని చూస్తున్నారు మేకర్స్.


