శిధిలావస్దలో ఉన్న భవనాలను తొలగింపు: జీవీఎంసీ
- 79 Views
- wadminw
- October 5, 2016
- రాష్ట్రీయం
విశాఖపట్నం, అక్టోబబర్ 5 (న్యూస్‌టైమ్): నగరంలో పాడుపడి శిధిలావస్ధలో నున్న భవనాలను గుర్తించి తొలగించాలని జివియంసి కమిషనర్ హరినారాయణన్ పేర్కొన్నారు. బుధవారం జగదాంబ కూడలి నుండి పాతపోస్టాఫీసు వరకు క్షేత్ర పర్యటన జరిపారు. ఈ సందర్భంగా రొడ్డుపై చెత్త, మురుగు పేరుకుపోయి ఉండడం చూసి వాటిని తొలగించాలని ఆదేశించారు. డ్రెయిన్లలో పేరుకుపోయిన చెత్తను తొలగించి మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు, రోడ్లను గోతులమయం చేసి, హోర్డింగులు పెట్టే వారిపై జరిమాన విధించాలని సూచించారు. జగదాంబ కూడలి – వాచ్ హౌస్ వద్ద రోడ్డు వెడల్పును కొలిచి పరిశీలించారు.
సర్వేను దసరా నాటికి అక్టోబరు 15 నాటికి పూర్తి చేయాలని, టిడిఆర్ లు తయారు చేసి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. లక్ష్మీటాకీసు గానుగల వీధిలో బహిరంగా మలవిసర్జన జరుగుతోందని సమాచారం వచ్చినందున ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. జోనల్ కమిషనర్ వి.చక్రధరరావు, ఇ.ఇ మహేష్‌లను ఓడిఎఫ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని, పాడైన ప్రహరీ గోడ నిర్మాణం, వెల్లవేయడంతో బాటు పుట్‌పాత్‌పై మొక్కలు నాటాలని పేర్కొన్నారు. ఓడిఎఫ్ పై ఏ సమాచారం వచ్చినా స్పందించి సరిదిద్దాలని ఓడిఎఫ్రహిత (ఓడిఎఫ్) విశాఖ లక్ష్యాన్ని కొనసాగించాలని ఆదేశించారు. క్షేత్రపర్యటనలో ఇన్‌ఛార్జి సిసిపి సురేష్‌కుమార్, జోనల్ కమిషనర్ వి.చక్రధరరావు, ఇ.ఇ మహేష్, డిసిపి సునీత, శానిటరీ సూపర్వైజర్ శ్యాంసుందర్, ఏసిపి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


