షార్ట్సర్వ్యూటా? లేక రికార్డులు తగులపెట్టారా?
నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం పరిధిలోని పౌర సరఫరా శాఖ కార్యాలయంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్టు సమాచారం. ప్రతి నెలలో రేషన్ పొందే 7 లక్షల 50 తెల్ల రేషన్‌కార్డు వినియోగదారుల వివరాలున్న రికార్డులన్ని అగ్నికి ఆహుతి అవడంపై పలు అనుమానాలకు తావు ఇస్తోంది. అంతేకాక గత ఖరీఫ్ సీజన్లో రైస్ మిల్లర్ల నుంచి సేకరించిన ధన్యంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు కొందరు గోల్మాల్ చేశారంటూ ఇందులో పది కోట్ల మేర అవినీతి జరిగిందని సాక్ష్యాత్తు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆరోపించడం వెనుక ఈ సంఘటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సంఘటనలో రికార్డులన్ని దగ్ధమైనట్టు తెలిసింది. తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా పౌర సరఫరాల కార్యాలయంలో పంటలు చెలరేగాయి. కార్యాలయంలో నిద్రిస్తున్న వాచ్మెన్ ఈ విషయం గమనించలేదు. ఇతర కార్యాలయాలం వాచ్మెన్లు దీన్ని గమనించి అతడిని పలిచారు. మంటల నుండి ఆయన కిందకు వచ్చే సమయంలో కాళ్లు కాలిపోయాయి.
అతడిని ఆసుపత్రికి తరలించారు. డీఎస్వో ధర్మారెడ్డి అక్కడకు చేరుకుని అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. వెంటనే వారు మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే పౌర సరఫరా శాఖలోని రికార్డులన్ని కాలిపోయాయి. అంతేకాకుండా కంప్యూటర్లు సైతం పూర్తిగా కాలిపోయాయని తెలిసింది. మొత్తం మీద ఈ సంఘటన షార్ట్సర్వ్యూట్ వల్ల లేక ఎవరైనా ఈ సంఘటనకు బాధ్యులన అన్నదానిపై విచారణ జరుగుతోంది. మొత్తం మీద ఈ సంఘటన సంచలనం కలిగించింది.


