సంక్షేమమే తెదేపా లక్ష్యం: మంత్రి సుజాత
- 86 Views
- wadminw
- January 4, 2017
- Home Slider రాష్ట్రీయం
రాష్ట్రాన్ని బహిరంగ మలవిసర్జనలేని స్వచ్ఛాంధ్ర ప్రదేశ్‌గా తీర్చిదిద్దేక్రమంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి రాష్ట్రంలో తాజాగా 25 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయగా అందులో 7 కోట్ల రూపాయలను పశ్చిమ గోదావరికి విడుదల చేసామని రాష్ట్ర గనులు మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి పీతల సుజాత చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో మంగళవారం నిర్వహించిన 4వ విడత జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈసందర్భంగా రాష్ట్ర మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ బహిరంగ మలమూత్ర విసర్జన లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందుకోసం ప్రతీ ఇంటికీ మరుగుదొడ్డి నిర్మాణానికి 15 వేల రూపాయల ఆర్ధిక సహాయం ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునే లబ్దిదారులకు ఎ ప్పటికప్పుడు నిధులు ప్రభుత్వం విడుదల చేస్తున్నదని తాజాగా బకాయిలు చెల్లింపుకోసం పశ్చిమ గోదావరికి 7 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందన్నారు.
ప్రతీ మహిళకూ ఇంటికీ 2017 జూన్ నాటికి గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యంగా దీపం పధకం అమలు చేస్తున్నామని తద్వారా ఇంటి ఆడబిడ్డలకు ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. 3వ విడత జన్మభూమి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుండి అందిన వినతులను చాలావరకూ పరిష్కరించామని మిగిలినవి త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. 4వ విడత జన్మభూమి కార్యక్రమం ద్వారా కుటుంబవికాసం సమాజ వికాసం పేరిట 15 ప్రాధాన్యతాంశాలకు ప్రాధాన్యతనిచ్చి వాటి అమలుకు చర్యలు చేపట్టామన్నారు.
గత రెండున్నర సంవత్సరాల్లో 65 వేల కోట్ల రూపాయలతో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసామన్నారు. రాష్ట్రంలో ప్రతీ కుటుంబం నెలకు కనీసం 10 నుండి 15 వేల రూపాయలు ఆదాయం పొందే దిశగా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా ఆవు, గేదె, మేకలు, గొర్రెలు, కోళ్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చేయూతనిస్తున్నదన్నారు. ప్రజలకు ఆహారభద్రత, ఆరోగ్యభద్రతనిచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నదన్నారు. కుటుంబంలో ప్రతీ ఒక్కరికీ 5 కేజీలు బియ్యం కేజీ ఒక రూపాయికి చొప్పున అందించడం జరుగుతున్నదన్నారు.
ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించే దిశగా ఇప్పటికే యన్‌టిఆర్ వైద్య సేవలు ప్రారంభించగా నూతన సంవత్సరంలో ఆరోగ్యరక్ష కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామన్నారు. మరోప్రక్క వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు నదుల అనుసంధానానికి సియం చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. పట్టిసీమ ఎ త్తిపోతల పధకాన్ని ఏడాదికాలంలో పూర్తి చేసుకుని కృష్ణాడెల్టాకు సాగునీరు అందించామన్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టను 2018 నాటికి పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు.
దీనిలో భాగంగా గత నెల 30వ తేదీన పోలవరం స్పిల్ వే కాంక్రీట్పనులను పండుగ వాతావరణంలో ప్రారంభించుకున్నామని అందులో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావడం ఆనందదాయకమన్నారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టు విషయంలో తమ పంటపొలాలను ఇచ్చిన రైతుల సహృదయానికి పాదాభివందనం చేస్తున్నానని వారికి ఎ ల్లప్పుడూ ఎ ప్పటికీ ఋణపడి ఉంటామని మంత్రి సుజాత చెప్పారు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా దేశంలోనే ప్రప్రధమంగా నిరుపేద కుటుంబానికి బీమా కల్పించిన రాష్ట్రం మనదేనన్నారు.
చంద్రన్న భీమా ద్వారా పేదలకు భీమా భద్రత కల్పిస్తున్నామన్నారు. దురదృష్టవశాత్తు ఆకుటుంబం యజమాని మరణిస్తే ఆపద సమయంలో భీమా చేసుకున్న కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకూ ఆర్ధిక సహాయాన్ని అందించడం జరుగుతున్నదన్నారు. నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్యంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి భూమికొరత సవాల్‌గా నిలిచిందని భూమి ఇచ్చేందుకు ఎ వరైనా ముందుకు వస్తే పెద్ద ఎ త్తున పరిశ్రమలు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
లింగపాలెం మండలంలో గత రెండున్నర సంవత్సరాల్లో 205 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు నిర్వహించామన్నారు. మండలంలో ప్రతీ ఏటా 5 కోట్ల రూపాయలను 4 వేల 544 మందికి పెన్షన్లుగా అందిస్తున్నామన్నారు. అర్హులైన వారికి ఇళ్లస్ధలాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇంకా ఎ క్కడైనా అర్హులైనవారు పెన్షన్ పొందకపోయినా ఇళ్లు మంజూరు కాకపోయినా జన్మభూమిలో ధరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. తొలుత మాతెలుగుతల్లికి మల్లెపూవు దండ ప్రార్ధనా గీతంతో జన్మభూమి కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం ముఖ్యమంత్రి సందేశాన్ని ఆడియో ద్వారా ప్రజలకు వినిపించారు.
తొలుత ఉచిత వైద్య శిబిరాన్ని తనిఖీ చేసి మందులను పరిశీలించారు. అనంతరం 16 మంది గర్భిణీలకు సంప్రదాయబద్ధంగా శీమంతాలు నిర్వహించి పసుపు, కుంకుమ, గాజులు, చీర అందించి మంత్రి సత్కరించారు. అనంతరం ఆమ్ ఆద్మీ యోజన క్రింద 1.75 లక్షల రూపాయల స్కాలర్ షిప్‌లను 144 మంది విద్యార్ధులకు అందించారు. అనంతరం క్రొత్త పెన్షన్లు, పట్టాదార్ పాస్ పుస్తకాలు, గ్యాస్ కనెక్షన్లు, యల్ఇడి బల్భ్లను మంత్రి పంపిణీ చేసారు.
ఈకార్యక్రమంలో జడ్పిటిసి గుత్తా సత్య సాయి వరప్రసాద్, యంపిపి మోరంపూడి మల్లిఖార్జునరావు, గ్రామ సర్పంచ్ ఉప్పలపాటి వరప్రసాద్, మండల ప్రత్యేకాధికారి, డ్వామా పిడి యంవి. రమణ, ఆర్‌డబ్ల్యుయస్ యస్ఇ అమరేశ్వరరావు, యంపిటిసిలు రాజారావు, వెంకటేశ్వరరావు, సొసైటీ ఛైర్మన్ బుజ్జి, తహశీల్ధారు సోమశేఖర్ యంపిడిఓ కృష్ణకుమారి, వ్యవసాయశాఖ ఏడి బుజ్జిబాబు, తదితరులు పాల్గొన్నారు.


