సంక్షోభంలో రాష్ట్ర సంక్షేమం: మధు యాష్కీ
- 67 Views
- wadminw
- October 4, 2016
- రాష్ట్రీయం
హైదరాబాద్, అక్టోబబర్ 4 (న్యూస్‌టైమ్): తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం సంక్షోభంలో పడిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ విమర్శించారు. నిజాం చక్కెర కర్మాగారం విషయంలో ఎంపీ కవిత కట్టుకథలు చెబుతున్నారని ఆరోపించారు. వంద రోజుల్లో నిజాం షుగర్స్‌ను స్వాధీనం చేసుకొని బకాయిలు చెల్లిస్తామని చెప్పినా, నేటికీ అమలు కాలేదని మంగళవారం ఇక్కడ మండిపడ్డారు.
బతుకమ్మ పేరుతో రూ.15కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవటంలో విఫలమైందని విమర్శించారు. ఎన్ కన్వెన్షన్, అయ్యప్ప సొసైటీ, ఆక్రమణల పేరుతో భారీగా వసూళ్లు చేశారని, ఇందుకు సంబంధించిన ఆధారాలతో అక్రమాలను త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు.
Categories

Recent Posts

