సమంత వ్యాధి ఏంటో తెలుసా ?
- 154 Views
- admin
- November 1, 2022
- Health & Beauty తాజా వార్తలు సినిమా
ప్రస్తుతం.. సమంతకు వచ్చి వ్యాధి గురించి హాట్ టాపిక్ నడుస్తోంది. రెండు రోజుల క్రితం.. సమంత ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అందర్నీ షాక్‌కు గురిచేసింది. చేతికి సెలైన్‌తో డబ్బింగ్ చెబుతున్న సమయంలో వెనకాల నుంచి తీసిన ఓ ఫొటోను షేర్ చేసింది. తాను గత కొంతకాలంగా ‘మయోసిటిస్’ వ్యాధితో బాధపడుతున్నట్లు అభిమానులకు చెప్పింది. అభిమానులు చూపించే ప్రేమ, అనుబంధమే తనకు తన జీవితంలో ఎదురైయే ప్రతీ ఛాలెంజ్‌ను ఫేస్ చేసేందుకు శక్తిని ఇస్తోందని సమంత పోస్ట్‌లో పేర్కొంది. మయోసిటిస్ నుంచి కూడా త్వరలోనే కోలుకుంటానని ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం.. సమంతకు వచ్చి వ్యాధి గురించి హాట్ టాపిక్ నడుస్తోంది. అసలు ఈ వ్యాధి ఏమిటి? ఎందుకు వస్తుంది? ఎన్ని రోజులకు నయం అవుతుంది? అనే ప్రశ్నలకు వైద్య నిపుణులు చెబుతున్న వివరాలు ఇలా ఉన్నాయి. మయోసిటిస్.. ఆటో ఇమ్యూన్ డిసార్డర్. ఈ ఒక్క వ్యాధి కారణంగా.. అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది శరీరాన్ని నెమ్మదిగా విచ్ఛిన్నం చేస్తుంది. మైయోసిటిస్ రుమటాలాజికల్ వ్యాధి అని డాక్టర్ బీరెన్ నద్కర్ణి చెప్పారు. ఈ సమస్య కారణంగా నడవడానికి ఉపయోగాపడే కండరాలలో వాపు, నొప్పి, బలహీనవపడటం వంటి సమస్యలు ఎదురవుతాయి. మయోసిటిస్ ఐదు రకాలు ఉంటుందని వైద్యులు వివరిస్తున్నారు. ఇది 5 రకాలుగా ఉంటుందట.
పాలిమయోసైటిస్..
దీనిలో చిన్న పని చేయగానే అలసిపోతారు. కండరాల నొప్పి ఎక్కువగా ఉంటుంది. నడిచినప్పుడు ఒక్కోసారి అదుపు తప్పి కిందపడిపోతారు.
డెర్మటోమయోసైటిస్..
కండరాలపై ఎఫెక్ట్ చూపిస్తుంది. చర్మంపై దద్దుర్లు వస్తాయి. యూవీ కిరణాల వల్ల డెర్మటోమయోసైటిస్ వస్తుందని వైద్యులు అంటున్నారు.
నెక్రోటైజింగ్ మయోపతి..
శరీర మధ్యస్థ భాగాల్లో కండరాలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. మోచేతులు, తొడలు, నడుము, భుజాలు, మెడ, వెనుక భాగంలో నొప్పి ఉంటుంది.
ఇన్‌క్లూజన్ బాడీ మయోసైటిస్..
నీరసం, తొడ, ముంజేతి, మోకాలి కింద కండరాలు పట్టేసి, నొప్పిగా అనిపిస్తాయి.
జువెనైల్ ఫామ్స్ ఆఫ్ మయోసైటిస్..
పిల్లల్లో, యుక్తవయసు ఉన్నవాళ్లలో ప్రభావం చూపుతుంది.
ఏ లక్షణాలు కనిపిస్తాయి..
మయోసిటిస్ లక్షణాలు దాని రకాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ఇది ఒక కండరం నుంచి స్టార్ట్ అయ్యి ఇతర కండరాలు, అవయవాలను ఎఫెక్ట్ చేస్తుంది. ఆ తర్వతా.. అన్నవాహిక, కళ్లు, గుండె కండరాలు బలహీనంగా మారవచ్చు.
జ్వరం, సడెన్‌గా బరువు తగ్గడం, అలసట, బలహీనత, కండరాల నొప్పి, దద్దుర్లు, తినడంలో ఇబ్బంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.
దీనికి ప్రత్యేకంగా వైద్యం లేదు. మయోసిటిస్ లక్షణాలను నియంత్రించడానికి ట్రీట్మెంట్, మందులు ఇస్తారు. ఇమ్యునోస్ప్రెసివ్ డ్రగ్స్, స్టెరాయిడ్స్ ఈ ట్రీట్మెంట్ వాడతారని చెబుతున్నారు. వీటితో పాటు వ్యాయామం, స్ట్రెచింగ్, యోగా, పోషకర ఆహారం మయోసిటిస్ను తగ్గించడానికి సహాయపడతాయని వైద్యులు తెలిపారు.


