సమస్యలతో మురగదాస్ నిజమేనా?
టాప్ హీరోల సినిమాలు అన్నీ పరస ఫ్లాపులుగా మారుతూ ఉండటం టాలీవుడ్ దర్శక నిర్మాతలనే కాకుండా మహేష్‌ను కూడా కలవార పెడుతున్నట్లు టాక్. బ్రహ్మోత్సవం షాక్ నుండి బయటపడి మురగదాస్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్న మహేష్‌కు కొరటాల శివ దర్శకత్వం వహించిన జనతా గ్యారేజ్ అనుకున్న స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోవడం భయపెడుతోంది అని తెలుస్తోంది.
దీనికి కారణం మురగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాను పూర్తిచేసిన వెంటనే వచ్చే సంవత్సరం నుండి కొరటాల దర్శకత్వంలో నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జనతా గ్యారేజ్ ఫెయిల్యూర్ మహేష్ కొరటాల కొత్త సినిమాపై ఏమైనా ప్రభావం చూపెడుతుందా అన్న భయాలు మహేష్‌ను వెంటాడుతున్నాయి అని అంటున్నారు. ఇది చాలదు అన్నట్లుగా మహేష్ ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న నేపధ్యంలో గతవారం మురగదాస్‌కు బాలీవుడ్లో తగిలిన షాక్ తన లేటెస్ట్ సినిమాపై చూపెడుతుందా అన్న భయం కూడా మహేష్‌ను టార్చర్ పెడుతోంది అన్న గాసిప్పులు వినిపిస్తున్నాయి.
మొన్న శుక్రువారం బాలీవుడ్లో మురగదాస్ దర్శకత్వం వహించి స్వయంగా నిర్మిచిన అకిరా బాలీవుడ్లో ఫ్లాప్ టాక్‌ను తెచ్చుకుంది. సోనాక్షి సిన్హా హీరోయిన్గా భారీ అంచనాలతో విడుదల కాబడ్డ మొదటిరోజు మొదటి షో నుండి నెగిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. దీనితో మురగదాస్ చాలా షాక్ అయ్యాడని తెలుస్తోంది. ఇప్పుడు ఆ షాక్ ప్రభావం మురగదాస్ లేటెస్ట్గా దర్శకత్వం వహిస్తున్న తన సినిమాపై ఉంటుందా అన్న అనుమానాలు మహేష్‌కు మొదలైనట్లు టాక్.
ఇప్పటికే బ్రహ్మోత్సవం ఫెయిల్ అయిన నేపధ్యంలో మురగదాస్ మహేష్ కాంబినేషన్ మూవీ ఎట్టి పరిస్తుతులలోను సూపర్ హిట్ అయితీరాలి. అదీ కాకుండా దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్‌తో తీస్తున్న ఈ సినిమా ఫలితం మహేష్ భవిష్యత్ సినిమాల మార్కెట్‌ను ప్రభావితం చేస్తుంది. ఈ విషయాలన్నీ మహేష్ ఆలోచనలలోకి వస్తూ ఉండటంతో మురగదాస్ అకిరా పరాజయం అదేవిధంగా కొరటాల శివ జనతా గ్యారేజ్ ఫెయిల్యూర్ విషయాలు మహేష్‌కు మహేష్‌కు మళ్ళీ నిద్రలేని పరిస్థుతులు సృష్టిస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.


