సమాజాన్ని బాగుచేసే శక్తి పుస్తకాలకే ఉంది: చంద్రబాబు
- 84 Views
- January 2, 2017
- Home Slider రాష్ట్రీయం
విజయవాడ: సమాజాన్ని బాగుచేసే శక్తి పుస్తకాలకు మాత్రమే ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఏర్పాటుచేసిన మహా పుస్తక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పుస్తకాలు చదవడం ద్వారా విజ్ఞానంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. ఇది సామాజిక అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. ఈ ప్రదర్శన జనవరి 11 వరకు కొనసాగనుంది. ఈ ప్రదర్శనలో 330 స్టాల్స్ ఏర్పాటుచేశారు.
Categories

Recent Posts

