సయామీ అందాల ఆరబోత!
- 73 Views
- wadminw
- January 8, 2017
- Home Slider సినిమా
టాలీవుడ్‌కు సయామీ ఖేర్ పేరు కొత్తే అయినప్పటికీ బాలీవుడ్లో తన సత్తాచాటుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టింది. టాలీవుడ్ జనాలకు పెద్దగా సుపరిచితం కాకపోయినా, రేయ్ సినిమాతో తెరంగేట్రం చేసింది ఈ భామ. వైవియస్ చౌదరి పరిచయం చేసిన భామ అయినప్పటికీ టాలీవుడ్ తెరపై తేలిపోయింది. కనీసం బాలీవుడ్ లోనన్నా తన అదృష్టం పరిష్కరించుకుంటుందనుకుంటే, అక్కడా అమ్మడికి నిరాశే ఎదురైంది. దీంతో ఇక చేసేదేమీ లేక అందాల ఆరబోతకు సిద్ధమైపోయింది.
మొన్నామధ్య ఓ హాట్ ఫోటో షూట్ చేసి తన అందాలు ఆరబోసి, దర్శకులకు, నిర్మాతలకు తను దేనికైనా సిద్ధమేనని చెప్పకనే చెప్పేసుకుంది. ఇలియానా రేంజ్లో తనకూ పేరొస్తుందని ఆశించిన ఈ భామకు టాలీవుడ్లో నిరాశే ఎదురైంది. కింగ్ ఫిషర్ క్యాలెండర్ సుందరిగా ఖేర్ అభిమానులకు సుపరిచితం. ఆమె తాజాగా బాలీవుడ్ మూవీ మీర్జ్యాలో నటిస్తోంది. ఈ చిత్రం ఈ నెలలో విడుదల కానుంది. తాజాగా ఈ అమ్మడు మీడియాతో మాట్లాడుతూ తాను పీకలోతు ప్రేమలో ఉన్నానంటూ బాంబు పేల్చింది.
కాలేజీలో చదువుతున్నప్పటి నుంచే ఓ అబ్బాయితో ప్రేమలో ఉన్నాను. అతనికి సినీ పరిశ్రమతో సంబంధం లేదు. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తనకు తెలియదు. కానీ తాను ఎప్పటికీ అతన్నే ప్రేమిస్తానని చెప్పింది. ఎవరైనా తామున్న రంగంలోని మరో వ్యక్తిని ప్రేమిస్తే వారి ఎదుగుదల ఆగిపోతుందని అనుకుంటారు. ఎందుకంటే ఒకే రంగంలో ఉన్నవారు ప్రేమించుకుంటే చిన్న కొలనులో ఉన్న కప్పకు అదే ప్రపంచంలా అనిపిస్తుంది. నిజానికి అలాంటివి కూడా జరగాలి. అలాంటి వాటి నుంచే మనం పాఠాలు నేర్చుకుంటామని పేర్కొంది. మూవీల్లో నటించడం వల్ల ఆ ప్రేమీకుడు తనను కాదన్నీ తాను మాత్రం అతడిని వదలదట.


