‘సింగం-3’ కాంబినేషన్‌పై పుకార్లు!
- 117 Views
- wadminw
- January 2, 2017
- Home Slider సినిమా
తమిళ నటుడు సూర్య నటజీవితంలోనే మైలురాయిగా నిలిచిన చిత్రం ‘సింగం’. దానికి కొనసాగింపుగా సింగం-2 కూడా అభిమానులను ఆశించినట్టుగానే అలరించింది. ఇక, ఆ రెండు చిత్రాలకు సీక్వెల్ అన్నట్లు తీస్తున్న ‘సింగం-3’ కాంబినేషన్‌పై మాత్రం సోషల్ మీడియాలో విస్తృతమైన పుకార్లు షికార్లు చేస్తున్నాయి. విలక్షణ నటుడు సూర్య నటిస్తున్న సింగం సీరీస్‌లో భాగంగా వస్తున్న ఎస్-3 సింగం 3లో ప్రభాస్ ఉన్నాడని నిన్న మొన్నటి రూమర్. అయితే బాహుబలి క్రేజ్‌ను సూర్య వాడేందుకే సినిమాలో ప్రభాస్ గెస్ట్ అప్పియరెన్స్‌కు ఒప్పుకున్నాడని అన్నారు. అయితే ఇది రూమరే అని తేలింది. స్వయాన ఎస్-3 దర్శకుడు హరి ప్రభాస్‌పై వస్తున్న రూమర్లను ఖండించారు.
సూర్య మాత్రమే ఉంటారని ప్రభాస్ కెమియోపై వస్తున్న వార్తలన్ని గాసిప్సే అని తేల్చి చెప్పారు. అయితే సూర్య తమ్ముడు కార్తి మాత్రం ఎస్-3లో కనబడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. డిసెంబర్లో విడుదల కానున్న ఈ సినిమా కార్తి కాష్మోరా కోసం దీపావళి రేసు నుండి తప్పుకుంది. మరోవైపు, ప్రభాస్ విగ్రహం మేడమ్ టస్సాడ్ మ్యూజియమ్‌లో ఏర్పాటుచేస్తున్న విషయం బయటకురావడంతో ప్రభాస్ అభిమానులు ఈ వార్త విని సంబరాలలో మునిగిపోయారు. అయితే టాలీవుడ్‌లోని కొందరు విశ్లేషకులు మాత్రం ఈ విషయంపై సరికొత్త చర్చలకు తెరతీస్తున్నారు.
ఫిలింనగర్ వినపడుతున్న వార్తల ప్రకారం మేడమ్ టస్సాడ్లో పెడుతున్నది బాహుబలి విగ్రహమా? ప్రభాస్ విగ్రహమా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం మేడమ్ టస్సాడ్ మ్యూజియమ్ నిర్వాహకులు ‘బాహుబలి’ విగ్రహం పెడతామని ‘బాహుబలి’ సినిమా టీమ్‌తో అగ్రిమెంట్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి కాని ప్రభాస్‌తో కాదు అన్న గాసిప్పులు ఫిలింనగర్లో హడావిడి చేస్తున్నాయి.


