సింగరేణి ఆధ్వర్యంలో ఇంధనం పంపిణీ
- 205 Views
- wadminw
- September 21, 2016
- రాష్ట్రీయం
ఆదిలాబాద్, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): సింగరేణి కార్మికుల సంక్షేమం పట్ల యాజమాన్యం తీసుకుంటున్న చర్యల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సింగరేణిలో సూపర్ బజార్ల వ్యవస్థను మరింత పటిష్టం చేసి కార్మికులకు తరసరమైన ధరలకు న్యాణమైన వస్తువులను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే వంటగ్యాస్ కూడా పంపిణీ చేస్తుండగా తాజాగా కార్మికులకు, ఉద్యోగులకు పెట్రోల్ బంక్‌లను అందుబాటులో తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు. సూపర్ బజార్ల ద్వారా పెట్రోల్, డిజిల్ బంక్‌లను ఏర్పాటు చేసి క్రేడిట్ కార్డుల ద్వారా అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రైవేట్ వ్యక్తులు కూడా ఈ సేవలను వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పించనున్నారు.
ఈ మేరకు సింగరేణి యాజమాన్యం స్థలాలను సేకరించి కొనుగోలు చేసిన అనంతరం ఈ పెట్రోల్ బంక్‌లను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని శ్రీరాంపూర్‌లోని ఏరియాలోని నస్పూర్, బెల్లంపల్లి ఏరియాలోని గోలేటిలో పెట్రోల్ బంక్‌ల ఏర్పాటు కోసం స్థలాల సేకరణ పూర్తయినట్టు తెలుస్తోంది. సూపర్ బజార్ల ద్వారా పంపిణీ చేస్తున్న నిత్యావర వస్తువుల నాణ్యతపై సింగరేణిలో కార్మికులకు ఎంతో నమ్మకం కలిగింది. నాణ్యతతో కూడిన వస్తువులను సరసరమైన ధరలకు అందిస్తూ మన్ననలు పొందిన సింగరేణి యాజమాన్యం ఇదే తరహాలో పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేసి తద్వారా కార్మికులకు నాణ్యమైన ఇంధనాన్ని అందించేందుకు యామాజన్యం నిర్ణయించింది.
ప్రైవేట్ బంక్‌లో పెట్రోల్, డిజినల్ సరఫరాలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఎన్నో ఆరపణలు వస్తున్న నేపథ్యంలో నాణ్యమైన ఇంధనాన్ని కార్మికులకు, ఉద్యోగులకు అందించేందుకు సింగరేణి సంస్థ ఈ బంక్‌ల ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
నిర్మల్ జిల్లాను నిలిపివేయాలంటూ ఆందోళన
ఆదిలాబాద్, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగా మరోవైపు పునర్వీభజన విషయమై ప్రజలు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా కొత్త జిల్లాల ఏర్పాటు మండలాలు,రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిర్మల్ జిల్లా ఏర్పాటు నిలివేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా సంక్షరణ సమితి ఆధ్వర్యంలో నిరవధిక నిరహార దీక్షలు కొనసాగుతన్నాయి. నిర్మల్ జిల్లా ఏర్పాటు వల్ల విద్యా, ఉద్యోగ, రాజకీయ పరంగా ఆదిలాబాద్ ప్రాంతానికి తీరని నష్టం వాటిల్లితుందని వారు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 80 శాతం గిరిజన ప్రాంతం ఉండడం వల్ల గిరిజనలు, గిరిజనహేతరుల మధ్య సమతూల్యం దెబ్బతిని నిరుద్యోగులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుతో 80 శాతానికి పైగా ఉద్యోగులు మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయరని, ఆదిలాబాద్ జిల్లాలో పని చేసేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో మరింత వెనుబాటు తప్పదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజులుగా ఆందోళన కార్యక్రమాలతో ఆదిలాబాద్ జిల్లా అట్టుడుకిపోయింది. ఈ నెల 22న ఆదిలాబాద్ జిల్లాకు బంద్ పిలుపునిచ్చినట్లు సమితి నాయకులు పేర్కొన్నారు. ఈ బంద్‌కు విద్యా, వ్యాపార సంస్థలతోపాటు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని వారు కోరారు. ప్రభుత్వం ప్రజల మనోభావాలను గౌరవించి నిర్మల్ జిల్లా ఏర్పాటును నిలిపివేయకపోతే మరింత ఆందోళన కార్యక్రమాలు తప్పవని హెచ్చరించారు.
ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు: డీఆర్వో
ఆదిలాబాద్, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): వచ్చే నెల 1వ తేదీ నుండి ప్రారంభమయ్యే సార్వత్రిక, 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని డీఆర్వో సంజీవరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షల్లో ఎలాంటి అక్రమాలు, చూచిరాతలకు ఆస్కారం లేకుండా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. జిల్లావ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలకు ఎనిమిది కేంద్రాలను ఏర్పాటు చేశామని ఈ పరీక్షలకు 02,42 మంది హాజరవుతారని, అదే విధంగా ఇంటర్ పరీక్షలకు ఆరు కేంద్రాలను ఏర్పాటు చేయగా 1205 మంది హాజరు కానున్నారని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగతాయని అన్నారు. ఈ పరీక్షా కేంద్రాలలో అన్ని వసతులు కల్పించి అభ్యర్థుల కోసం ఆయా పరీక్షా కేంద్రాలకు పత్రులను నడిపించే విధంగా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
నిర్మల్ జిల్లా ఏర్పాటుపై 1820 అభ్యంతరాలు
ఆదిలాబాద్, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన ముసాయిదాలపై పెద్ద సంఖ్యలో జిల్లావ్యాప్తంగా అభ్యంతరాలు, సూచనలు అందాయి. గత నెల 22వ తేదీ నుండి మొదలైన అభ్యంతరాల స్వీకరణ ఈ రోజుతో ముగియనున్నది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై గత నెల 22వ తేదీన ముసాయిదా విడుదల చేసి ఏమైన అభ్యంతరాలు ఉంటే స్వీకరించే విధంగా నెలరోజులపాటు ప్రజలకు గడవు ఇచ్చింది. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా వివిధ అంశాలపై 1820 అభ్యంతరాలు, సూచనలు ప్రభుత్వానికి అందాయి. ఇందులో 1700 అభ్యంతరాలు ఆన్లైన్లో నమోదు కాగా 120 అభ్యంతరాలు దరఖాస్తు రూపంలో వచ్చాయి. ఇందులో ఎక్కువ మంది ఆదిలాబాద్ జిల్లా నుంచి నిర్మల్ జిల్లాను విభజించవద్దని అభ్యంతరాలు రాక కొత్త మండలాల ఏర్పాటు, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు తదితర అంశాలపై సూచనలు, అభ్యంతరాలు వచ్చాయి. జిల్లాల ఏర్పాటుపై 881 అభ్యంతరాలు రాగా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై 90, మండలాల ఏర్పాటుపై 815 అభ్యంతరాలు, తమ తమ ప్రాంతాలను ఉన్న జిల్లాలోనే ఉంచాలని, మరికొన్ని అభ్యంతరాలు తమ ప్రాంతాలను కొత్త జిల్లాలో కలపాలని విజ్ఞప్తులు అందాయి. ప్రభుత్వం విజయదశమి నుండి కొత్త జిల్లాల పాలన ప్రారంభించాలని వచ్చిన ఆదేశాల మేరకు అధికారులు చేస్తున్న కసరత్తు తుదిశలకు చేరాయి. నిర్మల్, మంచిర్యాలలో పరిపాలన కోసం ప్రభుత్వ శాఖల ఏర్పాటుకు భవనాలను సిద్ధం చేశారు. యుద్ధప్రాతిపదికన చేపట్టిన ఈ చర్యలు అంతిమ దశకు చేరుకున్నాయి. ఉద్యోగుల పంపిణీ ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికే పోలీసులు, కేటాయింపు విషయమై పోలీస్ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. జిల్లా యంత్రాంగం చేపట్టిన కసరత్తు మరో పది రోజుల్లో ముగిసే అవకాశాలు ఉన్నాయి.


