సింగిల్ విండ్‌లో పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్
- 97 Views
- wadminw
- September 21, 2016
- రాష్ట్రీయం
ఏలూరు, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): జిల్లాలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి వచ్చే దరఖాస్తులను సింగిల్ విండో పద్దతిలో సత్వరమే పరిశీలించి అనుమతులు మంజూరుచేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆటోనగర్ అసోసియేషన్‌కు ఇచ్చిన షెడ్లను వారు తరలించలేని పరిస్ధితుల్లో ఉన్నందున తక్షణమే రద్దు చేయాలని సూచించారు. స్ధానిక కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశంలో కలెక్టరు అధ్యక్షత వహించారు.
మూడునెలల నుంచి ప్రతీవారం ఈఅంశాన్ని ప్రస్తావించి ఆదేశాలు జారీచేసినప్పటికీ ఎటువంటి కదలిక లేదని అధికారులు వారితోమాట్లాడి ఎందువలన తరలించలేకపోతున్నారని కలెక్టరు ప్రశ్నించారు. వారికి ఇచ్చిన షెడ్స్‌ను ఉపయోగించుకోకపోతే ఏమిలాభం కాబట్టి వారు తరలించలేని పరిస్ధితుల్లో ఉన్నట్లయితే వెంటనే రద్దు చేయాల్సిందిగా చెప్పారు. సింగిల్ డెస్క్ ఈవారం పరిశ్రమలు పొల్యూషన్ అనుమతులు, పంచాయతి అనుమతులు, పంచాయతి, టౌన్ ప్లానింగ్ అనుమతులకై ఐదు ప్రతిపాదనలు వచ్చాయని వాటినన్నింటినీ కూడా అనుమతించినట్లుగా కలెక్టరు చెప్పారు. ప్రోత్సాహకాలు మంజూరుకై 20 ప్రతిపాదనలు వచ్చాయని వాటిని కూడా అనుమతించడం జరిగిందని కలెక్టరు చెప్పారు.
ఐఐడియఫ్ ఫండ్స్ క్రింద పరమేశ్వరి బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 58 లక్షల 14 వేల 300 రూపాయలు ప్రతిపాదనలను జిల్లా ప్రోత్సాహక కమిటీకి అనుమతిస్తూ దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుమతికై పంపించాల్సిందిగా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ని కలెక్టరు ఆదేశించారు. పర్యావరణ, ఇతర శాఖలవారు వారికొచ్చిన ప్రతిపాదనలను ఆలశ్యం చేయకుండా వెంటనే మంజూరు చేసినట్లయితే జిల్లాకు త్వరితగతినే పరిశ్రమలొచ్చే అవకాశం ఉంటుందని, ఆదిశలో అధికారులు కృషి చేయాలని కలెక్టరు చెప్పారు.
ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ఇన్ఛార్జ్ ఉపసంచాలకులు ఆదిశేషులు, ఏసుదాసు, సిటిఓ కేదారేశ్వరరావు, డిడి సోషాళ వెల్ఫేర్ శ్రీమతి రంగలక్ష్మీదేవి, ఏపియస్యస్సి డిప్యూటీ మేనేజరు మధన్, డిప్యూటి చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మోహనరావు, పొల్యూషన్ కంట్రోలు బోర్డు ఇఇ వెంకటేశ్వరరావు, ఏడిఇ ట్రాన్స్‌కో రవికుమార్, ఏపిఐఐసి ప్రతినిధి, ఫ్యాబ్సీ ప్రతినిధి సురేష్, డియం యం. సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


