సిక్కోలు ట్రిపుల్ ఐటీకి 340 ఎకరాలు కేటాయింపు
శ్రీకాకుళం జిల్లాలో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి ఎచ్చెర్ల మండల పరిధిలో గల ఎస్.ఎంపురంలో సర్వే నెంబరు 112లో 340 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు జీవో నెంబరు 1164ను విడుదల చేస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె.సి.శర్మ ఉత్తర్వులను జారీ చేశారు. సెప్టెంబరులో జిల్లాకు ట్రిపుల్ ఐటీ ఉపకులపతి స్థల పరిశీలనకు వచ్చారు.
ఆ తర్వాత క్యాంపు కార్యాలయం కూడా జిల్లాలో ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది నుంచి ఇక్కడే తరగతులు నిర్వహించాలని యోచిస్తున్నారు. స్థలం కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళా వెంకటరావులు కృతజ్ఞతలు తెలిపారు.
Categories

Recent Posts

