సీజనల్ వ్యాధిగ్రస్తుల సమాచారానికి టోల్ ఫ్రీ ఫోన్లు
- 79 Views
- wadminw
- September 21, 2016
- రాష్ట్రీయం
ఏలూరు, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): పశ్చిమ గోదావరి జిల్లాలో అంటువ్యాధులు, విషజ్వరాలు, తదితర వ్యాధులతో బాధపడే ప్రజల సౌకర్యార్ధం జిల్లాలో నాలుగు టోల్ ఫ్రీ ఫోన్లను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా వైద్య విధానపరిషత్తు కోఆర్డినేటర్ డాక్టర్ శంకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అంటువ్యాధులు, అతిసారవ్యాధి, తదితర జ్వరాలబారినపడి ప్రజలు బాధపడుతుంటే తగిన సమాచారాన్ని ఈటోల్ ఫ్రీ నెంబర్లకు అందిస్తే యుద్ధప్రాతిపదికన అవసరమైన వైద్యసేవలు అందించడం జరుగుతుందని ఆయన చెప్పారు.
జిల్లాకలెక్టరు డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశాల మేరకు ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాలలో నాలుగు టోల్‌ఫ్రీ టెలీఫోన్లను ఏర్పాటుచేసామని శంకరరావు చెప్పారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో 1800 425 0412 ఫోన్ నెంబరుకు ఎవరైనా 24 గంటల్లో ఫోన్ చేయవచ్చునని అదేవిధంగా తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో 1800 425 0413, తణుకు ఏరియా ఆసుపత్రిలో1800 425 0415, జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో1800 425 0416 ఆయా నెంబర్లకు ప్రజలు ఫోన్ చేసి సత్వరం వైద్యసేవలు పొందవచ్చునని ఆయన చెప్పారు. జిల్లావ్యాప్తంగా పారిశుద్ధ్యంపై ప్రజల్లో సరైన అవగాహన కలిగించి అంటు వ్యాధులు ప్రబలకుండా అవసరమైతే ప్రజల ఇంటివద్దకే వైద్యబృందం వచ్చి ప్రత్యక్ష పర్యవేక్షణలో మందులు మ్రింగించే ఏర్పాటు కూడా చేయడం జరిగిందని శంకరరావు చెప్పారు.


