సుందర నగరంగా కాకినాడ: ఎంపీ తోట
- 86 Views
- wadminw
- January 4, 2017
- Home Slider స్థానికం
దేశంలో ఆకర్షనీయ నగరంగా ఎంపికైన కాకినాడ నగరానికి వెయ్యి కోట్ల నిధులు 5 సంవత్సరాల కాలంలో ప్రతీ ఏటా 200 కోట్లు చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తాయని కాకినాడ ఎం.పి. తోట నరశింహం తెలిపారు. మంగళవారంనాడు కాకినాడ గాంధీనగర్లోని 43, 44 డివిజన్ల జన్మభూమి వార్డు సభను గాంధీగర్ మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న యం.పి. నరసింహం మాట్లాడుతూ కాకినాడ నగరానికి ఆకర్షనీయ నగర పనులు తొందరలో ప్రారంభం కానున్నాయని, ఈ పనులు పూర్తి అవడం ద్వారా కాకినాడ సుందర నగరంగా రూపుదిద్దుకొంటుందన్నారు.
అదే విధంగా కాకినాడలో ఏర్పాటు చేసే పరిశ్రమల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. రాష్ట్రంలో పలు అభివృధ్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నగర శాసన సభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అర్హులైన వారికందరికీ పింఛన్లు మంజూరు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలక్టర్ హెచ్.అరుణ్ కుమార్, మున్సిపల్ కమీషనర్ అలీమ్ బాషా, అదనపు కమీషనర్ యస్.గోవిందస్వామి, తహశిల్దార్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 43, 44 డివిజన్లోని లబ్దిదారులకు కొత్తరేషన్ కార్డులు, చంద్రన్న సంక్రాంతి కిట్లు పంపిణీ చేసారు.


