సుఖ సంసారానికి సప్త సూత్రాలు!
పెళ్లి అనేది ప్రతి ఒకరి జీవితంలోనూ ఓ మధురానుభూతి. అందరి జీవితాల్లోనూ ఏదో ఓ సమయంలో మ్యారేజ్ చేసుకోవాల్సిందే. అయితే బ్యాచిలర్ జీవితానికి పెళ్లి తర్వాత లైఫ్‌కు చాలా తేడా ఉంటుందన్నది కాదనలేని నిజం. అప్పటి వరకు ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేసిన వారు పెళ్లి తర్వాత కొన్ని బాధ్యతలకు, బంధాలకు కట్టుబడాల్సి వస్తుంది. అయితే ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్న పెద్దగా పట్టించుకునే వారు ఉండరు. కానీ మ్యారేజ్ అయ్యాక కూడా అలాగే ఉంటానంటే అస్సలు కుదరదు. ఆఫ్టర్ మ్యారేజ్ మాత్రం విధానాలు మారాల్సిందే.
అయితే మార్పు ఆ మార్పు మన ఆర్థిక ప్రణాళికలతో ప్రారంభమవ్వాలి. అది కూడా పక్కా ప్రణాళికబద్దంగా ఉండే విధంగా చూసుకోవడం తప్పని సరి. పెళ్లి తర్వాత జీవితం సాఫీగా సాగలంటే సరైన ప్రణాళికలు వాటికి అనువుగా స్థిరమైన ఉద్యోగం, ఖర్చుల విషయంలో ముందు జాగ్రత్త, పొదుపు అవసరం. జీవితంలో అనేకం డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. చాలా పనులయ్యేది దాంతోనే. కొత్తగా పెళ్లైన వారికి జీవితంపై ఎన్నో కలలుంటాయి. వాటిల్లో సొంతిల్లు, పుట్టబోయే పిల్లల భవిష్యత్తు, విహార యాత్రలు, వయస్సు మల్లిన తల్లిదండ్రుల సంరక్షణ, అత్యవసర వైద్య ఖర్చులు, రిటైర్మెంట్ వంటివి ప్రధానమైనవి. అందుకే కొత్త జంట వీటన్నిటినీ వివరంగా చర్చించుకొని, వాటికనుగుణంగా ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి.
ఇక్కడ ద్రవ్యోల్భణాన్ని పరిగణలోకి తీసుకోవడం మరిచిపోవద్దు. ఒక్కసారి ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకున్నాక వాటిని అనువైన ఇన్వెస్ట్మెంట్ సాధనాల గురించి తెలుసుకోవాలి. సరైన సాధానల్లో పెట్టుబడి పెడితేనే కదా మన కలలు సాకారమయ్యేది. అందుబాటులో ఉన్న అన్ని పెట్టుబడి సాధనాల గురించి తెలుసుకోండి. అవసరమనుకుంటే ఆర్థిక సలహాదారులను సంప్రదించండి. మీ ఆదాయం, వ్యయాలు, మీ భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేయాల్సిన మొత్తం, రిస్క్‌ను ఎదుర్కొనే సామర్థ్యం వంటివన్నీ భార్యభర్తలిద్దరూ చర్చించండి.
భార్యా భర్తలు ఇరువురికి ఆర్థికపరమైన విషయాలపై ప్లానింగ్ ఉండాలి. సరైన ఆర్థిక ప్రణాళికల్ని, వ్యుహాల్ని రూపొందించుకున్నాక వాటి అనుగుణంగా కొనుగోళ్లు చేస్తుండాలి. ఆ తర్వాత వివిధ ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టాలి. అలా పెట్టే పెట్టుబడుల్ని క్రమంగా సమీక్షించుకోవాలి. అంటే మనం చేసే ఇన్వెస్ట్ మెంట్లు మంచి రాబడిని అందిస్తున్నాయా లేదా అని చూసుకోవాలి. సరైన ఫలితాలివ్వని పెట్టుబడులను ఇతర రంగాలవైపు బదిలీ చేయడండి. పెట్టుబడుల తగిన రిటర్న్స్‌కు ఇది ఎంతో కీలకం.
ఇన్వెస్ట్ మెంట్లు వృద్ధి చెందేలా చూసుకోండి. ఈ సలహాలు పాటించడం వల్ల మీరు ఆర్థికంగా నిశ్చింతగా ఉండే అవకాశం ఉంది. కొత్తగా పెళైన వారు బ్యాంకులో జాయింట్ సేవింగ్స్ ఖాతా తెరవండి. ప్రతినెల కొంత మొత్తంలో డబ్బుల్ని అందులో దాచుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్లు, ఖర్చులు ఈ జాయింట్ అకౌంట్ ద్వారానే చేయండి. ఆర్థిక వ్యవహారాలను ఇరువురి మధ్య ఎలాంటి దాపరికాలు లేకుండా చర్చించుకోండి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఏదైన సమస్య తలెత్తితే ఇద్దరూ కలిసి పరిష్కారం వెతకండి. పెళైన తొలినాళ్లలో అధిక రిస్క్‌ను భరించడానికి ముందుండండి.
అప్పుడే ఎక్కువ లాభాలొచ్చే అవకాశముంటుంది. వయస్సు పెరిగే కొద్ది రిస్క్ భరించే సామర్థ్యాన్ని తగ్గించుకుంటూ వెళ్లండి. ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక స్థిరత్వం లభించడమే కాకుండా మనీ మేనేజ్మెంట్పై ఓ అవగాహన వస్తుంది. ఫ్యూఛర్లో మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఆరోగ్యానికి ఆహారం… ప్రతిరోజు శృంగారం!
ఈ మధ్యకాలంలో వివాహం అయిన తర్వాత ఒకరిద్దరు పిల్లలు పుట్టగానే దాంపత్య /వైవాహిక జీవితం పై అనాసక్తి పెరుగుతుంది. దీనికి గల కారణాలు -ప్రతిరోజు పని వత్తిడి, ఆర్థిక ఇబ్బందులు లేదా ఆరోగ్య సమస్యలు. ఇలాంటి కారణాల వల్ల చిన్న వయసులోనే శృంగారం/సెక్స్‌పై వ్యామోహం తగ్గిపోతుంది. కానీ పూర్వ కాలంలో వివాహితులు ప్రతి రోజూ శృంగారంలో పాల్గొనటం వలన ఆరోగ్యపరంగా ఎంతో మేలు జరిగేదని వైజ్ఞానికులు చెబుతున్నారు. అందుకు నాలుగు కారణాలు చెప్పవచ్చు. శృంగారం అనేది వ్యాయామం లాంటిదనే విషయం అందరికీ తెలిసిందే. శ్వాస రేటు క్రమంగా పెరిగి ఎక్కువ కాలరీల శక్తి ఆవిరై – కోలెస్ట్రాల్ శాతం తగ్గి శరీరం ఫిట్నెస్ సంతరించు కొంటుంది. ఒక రైతు పొలంలోనో, ఒక కార్మికుడు ఫాక్టరీలోనో కష్టపడినంతన్న మాట అంటే ఎంతో శ్రమ పడినట్లు. వారానికి మూడు సార్లు 15 నిమిషాలు శృంగారంలో పాల్గొనటం వలన ఏడాదికి 7.500 కాలరీల శక్తి పోతుంది. ఇది 75 మైళ్లు జాగింగ్ చేసినంత ప్రయోజనం ఇస్తుంది. శృంగారం సమయంలో అధిక శ్వాస తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల శరీరంలోని కణాలకు విరివిగా ఆక్సిజన్ అందుతుంది. శృంగారంలో ప్రతి రోజూ పాల్గొనడం వల్ల ఎనలేని ప్రయోజనాలు ఉంటాయని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. దంపతుల మధ్య బంధం పటిష్టం కావడమే కాకుండా పగటి పూట రోజూవారీ పనుల్లో చిరాకు, ఒత్తిడి తగ్గుతుందని అంటున్నారు. ఉదయం చేసే జాగింగ్ కంటే ఎన్నో రెట్లు సెక్స్ ఉత్తమం అంటున్నారు వైద్య నిపుణులు. అంతేకాదు అలసిపోయి ఇంటికొచ్చిన వెంటనే మీకు నచ్చిన స్వీట్స్ తీసుకోవడం ద్వారా స్టామినా పెంచుకోవచ్చని, తద్వారా రోజంతా కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పడకగదిలో దూరి మీ భాగస్వామిని రెచ్చగొట్టి, ఊపేయడానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. అలసిపోయిన దేహానికి, మనసుకు ఊరటనిస్తూ ఆ తర్వాత ఆనందాన్ని జుర్రుకోవడానికి అవి పనికి వస్తాయని అంటున్నారు. శృంగారానికి ముందు ఆహారాల్లో పచ్చికూరలు, చేదుగా, వగరుగా ఉండే కూరగాయలు తినడం కన్నా కొన్ని ఆరోగ్యకరమైన తీపి పదార్థాలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. తియ్యని పదార్థాలు తీసుకుంటే మీ భాగస్వామితో సంభోగం కూడా మధురంగా ఉంటుందని చెబుతున్నారు. సలాడ్స్‌లో టమోటోల ముక్కలను జోడించి డిన్నర్‌కు ముందు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. శృంగారానికి ముందు ఒక గ్లాస్ బాదం మిల్క్ త్రాగడం వల్ల మంచి శక్తినిపొందవచ్చు. ఫిగ్స్ లేదా అత్తిపండు లో అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉండి, లిబిడోను మెరుగుపరుస్తుంది. శృంగారంలో పాల్గొనడానికి ముందు చాక్లెట్ తినడం వల్ల మీ స్టామినా పెరుగు తుంది. చాక్లెట్ తింటూ టీవీల్లో భామలు కోరికలతో రగిలిపోయే బుసకొట్టించే దృశ్యాలను చూసే వుంటారు. ఆక్రోట్, తేనె, క్యారెట్, వాటర్ మిలన్, దానిమ్మ, బొప్పాయి, మామిడి, కర్జూరం వంటి ఫ్రూట్స్‌ను సలాడ్ రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని, శరీరానికి కావలసిన శక్తి సమకూరుతుందని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. శృంగారంపై ఇష్టాన్ని జీవించి ఉన్నంత కాలం కొనసాగించాలి.


