సుపరిపాలన అందించడంలో జగన్ విఫలం
- 11 Views
- admin
- January 24, 2023
- జాతీయం తాజా వార్తలు
కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు కేంద్ర మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ . గ్రామీణాభివృద్ధికి ప్రణాళిక సంఘం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వేరే మార్గంలో వాడుకుందని, దీనిపై సర్పంచ్లు తనకు వినతి పత్రాలు ఇచ్చారని, ఇది గ్రామ స్వరాజ్యంపై దాడి అని అన్నారు. పంచాయతీలకు ఇచ్చే నిధులను గ్రామాల అభివృద్ధికి ఉపయోగించాలని కేంద్ర మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ సూచించారు. సుపరిపాలన అందించడంలో సీఎం జగన్ విఫలమయ్యారని ఆరోపించారు. అతి తక్కువ సమయంలోనే ఏపీ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయిందని విమర్శించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉందని దేవుసిన్హ్ చౌహాన్ విమర్శించారు. ఏపీ ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిగా లేరని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. కేంద్రం 20 లక్షల ఇళ్లను ఏపీకి మంజూరు చేసిందని, కానీ ఇక్కడ ఒక్కటి కూడా నిర్మించడం లేదని ఆరోపించారు.


