సైకో సీఎంని ఎదుర్కోవడానికి సిద్ధం
- 19 Views
- admin
- January 30, 2023
- తాజా వార్తలు
సైకో ముఖ్యమంత్రిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని టీడీపీ నాయకుడు పట్టాభి స్పష్టం చేశారు. చింతకాయల విజయ్ పార్టీ తరఫున సోషల్ మీడియా విభాగానికి ఇన్చార్జ్గా ఉంటూ.. జగన్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి కుంభకోణాలకు సంబంధించి ఆధారాలతో సహా ప్రజల ముందుంచుతున్నారని, దీన్ని జీర్ణించుకోలేని ప్రభుత్వం విజయ్‌పై తప్పుడు కేసు పెట్టి.. ఈ రోజు సీఐడీ అధికారులు ఆయనను విచారిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో సైకో ప్రభుత్వం నడుస్తోందని దుయ్యబట్టారు. చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబం ప్రజల కోసం పోరాడుతుందని, అందుకే వారిని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. వెనుకబడిన వర్గానికి చెందిన ఒక బలమైన కుటుంబాన్ని ఉద్దేశ పూర్వకంగా టార్గెట్ చేసి పదే పదే ఆ కుంటుంబంపై దాడులు చేస్తూ.. తప్పుడు కేసులు పెడు తున్నారని అన్నారు. చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్‌కు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ వీడియో విచారణ చేయాలని అవినాష్ రెడ్డి చెబుతున్నారని, కానీ ఇతరులను మాత్రం విడియో విచారణ లేకుండా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


