సైనికుల్లో వెల్లివిరిసిన మానవత్వం!
మానవత్వం అన్నది పేద, పెద్ద, గొప్ప అన్న తేడా మధ్య ఉండదన్నది అందరికీ తెలియదేమో గానీ, భారత సైనికులకు మాత్రం తెలుసు. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. సాధారణంగా శత్రు దేశం నుంచి ఈగ వాలినా దాన్ని తుదముట్టిస్తారు సైనికులు. అంత పకడ్భందీగా ఉన్న సైనికులు గొప్పగా మానవత్వం చాటుకున్నారు. ఉడీ ఉగ్ర దాడిలో 19 మంది భారత సైనికులు మరణించిన అనంతరం దాయాది దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో భారత సైన్యం ఎల్వోసీ వెంబడి ఉగ్రశిబిరాలపై సర్జికల్ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం బీఎస్ఎఫ్ అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. నిన్న గామ మొన్న పాకిస్థాన్ దేశీయులు తమ కండ కావరాన్ని ప్రదర్శిస్తూ మా దేశంలో చిన్న పిల్లలు సైతం భారత్‌ను వ్యతిరేకిస్తున్నారని పాకిస్థాన్ అంటే 1971లా లేదని ఇప్పుడు భారత్‌కి సరైన బుద్ది చెప్పగల సామర్ధ్యం ఉందని ఓ పావురం ద్వారా మెస్సేజ్ పెట్టారు. అయినా కూడా భారత్ సంయమనం పాటిస్తూనే ఉంది.
తాజాగా పాకిస్థాన్ నుంచి ఓ బాలుడు దప్పిక తీర్చుకునే ప్రయత్నంలో పొరపాటున సరిహద్దు దాటాడు. 12 ఏళ్ళ మొహమ్మద్ తన్వీర్ దగ్గరకు చేరదీసి రాత్రంతా తమ శిబిరంలోనే ఆశ్రయం కల్పించారు. అంతే కాదు బీఎస్ఎఫ్ అధికారులు ఆ దేశ అధికారులకు సురక్షితంగా అప్పగించారు. మహ్మద్ తన్వీర్ది పాక్‌లో కసూర్ జిల్లాలోని ధరీ గ్రామం. ఆదివారం తన్వీర్ విపరీతమైన తప్పిక వేయడంతో దాహం తీర్చుకునేందుకు బోరు బావిని వెతుక్కుంటూ భారత సరిహద్దులోకి ప్రవేశించాడు.
అతణ్ని పంజాబ్‌లోని డోనా టెలు మాల్ బోర్డర్ చెక్‌పోస్టు వద్ద బీఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 12 ఏళ్ళ మొహమ్మద్ తన్వీర్ సురక్షితంగా పాకిస్థాన్ అధికారులకు అప్పగించి మానవత్వాని చాటుకున్నారు. కానీ పాకీస్థాన్ దుర్మార్గులు మాత్రం భారతీయ సైనికుడు చందు బాబూలాల్ చవాన్‌ను మాత్రం పాకిస్థాన్ నిర్బంధంలో ఉంచింది. కాగా, ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్ని భారత్, పాక్ వైపు చూస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా భారత్‌ని దొంగదెబ్బ తీయాలని ఎన్నో దుశ్చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్ ఇప్పుడు ఏకంగా ఉగ్రవాదలను భారత్‌పై ఉసిగొల్పుతుంది. ఈ సంవత్సరం జనవరి 1న పంజాబ్‌లోని పాఠాన్ కోటపై దాడులు నిర్వహించింది.
ఆ సమంలో మన సైనికులను ఏడుగురిని బలితీసుకున్నారు. గత వారం రోజుల క్రితం కాశ్మీర్‌లోని యూరీ సెక్టార్‌పై దాడి చేసి అన్యాయంగా 18 మంది జవాన్లను బలి తీసుకున్నారు. దీంతో భారత్ సైన్యం పగతో రగిలిపోయింది. ఇక పాకిస్థాన్ చర్యలను ఏమాత్రం సహించబోం అంటున్నారు. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ రెండు వైపులా వున్న ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం గత బుధవారం రాత్రి లక్షిత దాడులు (సర్జికల్ స్ట్రయిక్స్) నిర్వహించింది. ఈ దాడిలో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు, వారి మద్దతుదారులు మరణించినట్లు భారత సైనికాధికారులు ప్రకటించారు. అయితే పొరపాటున సరిహద్దులు దాటి పాక్‌లో అడుగుపెట్టిన సైనికుడిని అదుపులోకి తీసుకున్నాయి పాకిస్తాన్ భద్రతా బలగాలు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని ప్రకటించిన కొద్దిసేపటికే ఈ విషయాన్ని ప్రకటించాయి పాక్ దళాలు.
పాకిస్థాన్‌కు చెందిన డాన్ పత్రిక ఈ విషయంపై ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఎనిమిది మంది భారత సైనికులు ప్రవేశించారని.. పాక్ ఆర్మీ కాల్పుల్లో వారిలో ఏడుగురు చనిపోగా మిగిలిన ఒక్కరిని అదుపులోకి తీసుకున్నారని తెలిపింది. కాగా ఇదంతా అవాస్థవమని నియంత్రణ రేఖకు అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసి భారీ సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో పాక్ షాక్‌లో ఉందని దీంతో అవాస్తవమైన ప్రచారాలు చేస్తున్నారని సైనికులు ఎవరూ చనిపోలేదని ఆర్మీ అంటుంది.
అయితే రాష్ట్రీయ రైఫిల్‌కు చెందిన చందుబాబులాల్ చౌహాన్ అనే సైనికుడు పాక్ ఆర్మీ అదుపులో ఉన్నాడని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. తనను భారత రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మరోవైపు, భస్మాసురుణ్ణి ఎవరూ అంతం చేయనవసరం లేదు. వాడి చేతలే వాణ్ణి అంతం చేస్తాయి. అలాగే పాకిస్థాన్ తాను త్రవ్వుకున్న గోతిలో తానే పడబోతుంది. భారత్‌పై ఉగ్రమూకలను రవాణాచేస్తున్న పాకిస్థాన్‌కి, అదే ఉగ్రవాదం పక్కలో బల్లెంలా తయారవుతోంది. నిజం చెప్పాలంటే, భారత్‌లో పాకిస్థాన్ ప్రేరేపిత తీవ్రవాదం సృష్టించే మారణ హోమం కన్నా, అదే పాకిస్థాన్ పెంచి పోషించిన తీవ్రవాదం పాకిస్థాన్‌లో సృష్టించే మారణ హోమమే ఎక్కువ.
పాకిస్థాన్‌లో సైనికులు, పాలకులు, ఐ.ఎస్.ఐ అక్కడి తీవ్ర వాదుల కనుసన్నల్లో పనిచేయవలసిందే లేదంటే వారి అంతు చూస్తారు అక్కడ. సైన్యం మాట వినకపోతే ఉగ్రవాదుల బ్రతుకు కుక్క బ్రతుకే. ఇది చాలాకాలంగా జరుగుతున్న చరిత్రే. ఇక, తాజాగా మరోసారి పాకిస్థాన్ ఇరకాటంలో పడబోతుంది. అక్కడ సైనిక పాలన దిశగా అడుగులు పడుతున్నాయి. అంతర్జాతీయ సమాజంలో యురీ సెక్టర్పై తీవ్రవాద ఘటన తర్వాత పాకిస్థాన్ ఏకాకి అయ్యింది. భారత్‌లోకి పాక్ సైన్యం తీవ్రవాదుల్ని ఎగదోసిన వైనాన్ని ప్రపంచమంతా గుర్తించింది.
ముందు మీ దేశంలో తీవ్రవాదాన్ని అదుపులో పెట్టండి, తీవ్రవాదులకు సాయాన్ని ఆపేయండి అని అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కి తేల్చి చెప్పడంతో, అక్కడ తీవ్రవాద సంస్థలు, సైన్యం అప్రమత్తం అయింది. చైనా – పాకిస్థాన్ పారిశ్రామిక కారిడార్‌కి వ్యతిరేకంగా ఈ రెండు రాష్ట్రాల ప్రజలు భారత్‌కు అనుకూలంగా ఆందోళనలు ఉదృతం చేస్తున్నారు. వారిని అణచివేసే క్రమంలో సైన్యం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. ఏం చేసినా, బలూచిస్తాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఆందోళనలు తగ్గే పరిస్థితులు కన్పించడంలేదు.
పైగా, ఈ రెండు ప్రాంతాల్లో భారత అనుకూల నినాదాలు ఊపందుకుంటున్నాయి. బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఆందోళనలు పెరిగితే, అంతర్జాతీయ సమాజం ముందు మరోమారు దోషిగా నిలబడాల్సి వస్తుంది. ఈ వ్యవహారాలేవీ బయటకు రాకుండా పాకిస్థాన్ సైన్యం అక్కడ, భారత్‌పై యుద్ధానికి ముందస్తు సన్నాహాల్లో నిమగ్నమైపోయాయి. పాకిస్థాన్ ఆర్మీతోపాటు, అక్కడి వాయసేన కూడా తమ బలాన్ని ప్రదర్శించే పనిలో బిజీగా వుంది. ఓ వైపు ఐక్యరాజ్య సమితి సమావేశాలు జరుగుతున్న వేళ, పాకిస్థాన్ రెచ్చగొడుతున్నా భారత్ సంయమనం పాటించడం, వ్యూహాత్మక ఎత్తుగడగానే భావించాలి.
ఈ సంయమనం ద్వారా పాక్ దమన నీతి ని ఐక్యరాజ్య సమితిలో ఎండ గట్టేందుకు భారత్‌కి అవకాశం దొరికింది. అయితే, పాకిస్థాన్‌లో ఎప్పుడు సంక్షోభం తలెత్తినా, అది భారత్‌కి పరోక్షంగా ప్రమాదకరంగా తయార వుతుంది. అక్కడి సైన్యం, పాకిస్థాన్ ప్రభుత్వంపై తిరగబడటంతో పాటు, భారత్‌పై దండెత్తే అవకాశాలు పుష్కలం. ఇప్పుడే భారత్ మరింత అప్రమత్తంగా వుండాలి, ఆలోచించి అడుగెయ్యాలి. బలూచ్, పిఓకెలో పాకిస్థాన్ ప్రదర్శించే దమన నీతిని విశ్వ యవనికపై దృశ్యంలాగా ప్రపంచానికి చూపించాలి. అవసరమైతే మన వేగు వ్యవస్థను పటిష్ట పరచి ఆ రెండు రాష్ట్రాల ప్రజల్లో ఐఖ్యత సాధించి పెట్టి వారి చేతనే వివిధ దేశాల్లో పాకిస్థాన్ దమన నీతిని ప్రపంచం ముందు ఎండగట్టాలి. అలాగే మన జమ్ము & కశ్మీర్‌పై పాకిస్థాన్ ప్రేమలో ఉన్న కల్మషాన్ని, కుళ్ళును ఆ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా యువతకి వివరించే పని ప్రచారం యజ్ఞంలా కొన సాగించాలి.


