స్టేషన్గన్పూర్ లేదర్ పార్క్ కోసం 15 ఎకరాలు: కేటీఆర్
- 77 Views
- wadminw
- December 21, 2016
- రాష్ట్రీయం
స్టేషన్గన్పూర్లో ఏర్పాటు చేయనున్న మెదడ్పార్క్ పనులు తూతూమంత్రంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే రాజయ్య ఆరోపించారు. మంగళవారం శాసన సభలో ఈ అంశాన్ని రాజయ్య ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తారు. లేదర్పార్క్ ఏర్పాటుపై ప్రభుత్వం చోరవ చూపాలని కోరారు. పనులను ఎప్పటిలోగా వేగవంతం చేస్తారని ఆయన ప్రశ్నించారు.
లేదర్ పార్క్ ఏర్పాటుతో ఎంత మందికి ఉపాధి కల్పిస్తారో చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనికి మంత్రి కేటీఆర్ సమాధానం ఇస్తూ స్టేషన్గన్పూర్లో ఏర్పాటు చేయనున్న లేదర్ పార్క్ కోసం 15 ఎకరాలకు సేకరించడం జరిగిందని మంత్రి తెలిపారు. తొమ్మిది మిని లేదర్ పార్కులను అనుసంధానం చేసి మేగా లేదర్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. మేగా లేదర్ పార్క్ కోసం 270 కోట్ల పెట్టుబడి అవసరం అని ఆయన తెలిపారు.
Categories

Recent Posts

