స్నేహపురి కాలనీలో చోరీ
- 101 Views
- wadminw
- September 5, 2016
- తాజా వార్తలు
హైదరాబాద్: ఇంటి తాళాలు పగులగొట్టి సుమారు 20 తులాల బంగారు ఆభరణాలు, 35వేల నగదు దోచుకెళ్లిన సంఘటన చైతన్యపురి స్టేషన్ పరిధిలోని స్నేహపురి కాలనీలో చోటు చేసుకుంది. స్నేహపురికి చెందిన కిరణ్‌రెడ్డి వ్యాపారి. శుక్రవారం అతని భార్య చికిత్స నిమిత్తం వరంగల్ పట్టణానికి వెళ్లాడు. ఆదివారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో పక్కింటివారు కిరణ్‌కి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో నగరంలోని తన ఇంటికి చేరుకున్న కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగి ఉంటుందని, దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
కాగా, గతనెల 29 హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి మునగనూర్‌లో హత్యకు గురైన వెంకటేష్ కేసును పోలీసులు ఛేదించారు. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ పాతకక్షలు, కుటుంబ కలహాలే హత్యకు కారణమని తెలిపారు. మునగనూర్ గ్రామానికి చెందిన మద్ది వెంకటేష్‌కు మాదన్నపేట మార్కెట్లో ఫైనాన్స్ వ్యాపారం నిర్వహించే శ్రీనివాస్‌రెడ్డికి మధ్య ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో పాతకక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెంకటేష్‌పై శ్రీనివాస్‌రెడ్డి కక్షను పెంచుకున్నాడు.
అతనికి హతుడి సోదరుడు పాపయ్య జతకలిసాడు. మాదన్నపేటకు చెందిన కడవీణ సుధాకర్ ద్వారా పాతనేరస్థులుగొర్ల భరత్‌రాజ్, సుబ్బాక వంశీకృష్ణలకు వెంకటేష్‌ను హత్య చేసే బాధ్యతను అప్పగించారు. దీనికోసం వారికి రూ.3 లక్షలు సుపారీగా ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. గతనెల 29న ద్విచక్ర వాహనంపై వస్తున్న వెంకటేష్‌ను అడ్డగించిన భరత్‌రాజ్, వంశీకృష్ణలు వెంకటేష్‌పై కత్తులతో దాడిచేసి హత్యచేసి పరారయ్యారు. బైక్నెంబరు, ఇతర వివరాల ఆధారంగా తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు.
వారినుంచి రెండుబైక్‌లు, రెండు కత్తులతో పాటు రూ.7,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఏసీపీ భాస్కర్‌గౌడ్, ఇన్స్పెక్టర్లు నరేందర్‌గౌడ్, చంద్రశేఖర్, ఎస్సైలు మన్మద్కుమార్ పాల్గొన్నారు.


