స్పైప్ కార్డ్‌ల పట్ల మొగ్గుచూపుతున్న జనం
- 68 Views
- wadminw
- January 23, 2017
- Home Slider రాష్ట్రీయం
హైదరాబాద్: నగదురహిత లావాదేవీలపై ఇంతవరకు విరుచుకుపడుతున్న భారత జనం కేంద్రం కార్డు ద్వారా చెల్లింపులపై ప్రకటించిన రాయితీలు, కల్పిస్తున్న ప్రోత్సాహకాలతో కాస్త కుదుటపడుతున్నారు. పెట్రోల్, డీజిల్‌తో పాటు మరికొన్ని నిత్యావసరాల కొనుగోలుకు కార్డుల్ని వినియోగిస్తే 0.75 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో పాటు బంకులు, సూపర్ మాల్స్ వద్ద కార్డుల వినియోగం అనూహ్యంగా పెరిగింది.
ఇప్పటివరకు కార్డుల ద్వారా కొనుగోలును నిరసించిన వినియోగదార్లు కూడా ఇప్పుడు అటువైపే మొగ్గుచూపుతున్నారు. జేబుల్లోని కార్డులకు పనిపెడుతున్నారు. కేంద్రమిచ్చిన వెసులుబాటును ఎందుకు తాము వినియోగించుకోకూడదన్న ఆలోచన ప్రతి వినియోగదారుడిలోనూ తలెత్తుతోంది. పెద్దనోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా అనిశ్చితస్థితి నెలకొంది. డబ్బులు లేక ప్రజలు నానా అవస్థలకు గురవుతున్నారు. ఈ దశలో కేంద్రం ప్రకటించిన 0.75శాతం రాయితీ వీరిపై బ్రహ్మాస్త్రంలా పనిచేస్తోంది. ప్రకటన వెలువడ్డ కొన్ని గంటల్లోనే సానుకూల ఫలితాలు మొదలయ్యాయి.


