స్లిమ్‌గా ఉండాలా? రోజూ ఓ గుడ్డు తినండి!
స్లిమ్‌గా ఉండాలా? రోజూ ఓ గుడ్డు తినండి! అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజూ ఓ గుడ్డును ఆహారంగా తీసుకుంటే సన్నబడుతారని ఇప్పటికే చాలా పరిశోధనలు తేల్చారు. ఇంగ్లండ్‌లో జరిగిన సర్వేలో తెల్లవారుపూట పరగడుపున ఒక కోడిగుడ్డును తీసుకుంటే రోజంతా తీసుకునే ఆహారం ద్వారా అధిక క్యాలరీలను నియంత్రించవచ్చునని తేలింది. క్యాలరీలను కంట్రోల్ చేయడంలో కోడిగుడ్లు బాగా పనిచేస్తారు. అందుచేత అల్పాహారంతో కోడిగుడ్డు తీసుకుంటే మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనానికి మధ్య తీసుకునే చిరుతిళ్లకు చెక్ పెట్టవచ్చు.
స్నాక్స్ అధికంగా తీసుకోవడం ద్వారా శరీరంలో చేరే అధిక క్యాలరీలను నియంత్రించడంలో కోడిగుడ్డు బాగా పనిచేస్తుంది. మార్నింగ్ ఫుడ్‌లో ఎగ్ తీసుకుంటే మధ్యాహ్న భోజనాన్ని మితంగా తీసుకుంటారు. తద్వారా బరువు పెరగడం పొట్ట పెరగడం వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అదే విధంగా, ఎరుపు రంగు అరటిలో ఎన్నో ఔషధ గుణాలున్నారు. అమెరికాలో పండే ఈ పండ్లలోని బీటా కరోటిన్ కంటి వ్యాధులను దూరం చేస్తుంది. ఎరుపు అరటిలో హై పొటాషియం ఉంది. ఇది కిడ్నీలోని రాళ్లు చేరకుండా నివారిస్తుంది.
విటమిన్ సి, ఆంటి యాక్సిడెంట్లు, 50 శాతం పీచు పదార్థాలు ఇందులో పుష్కలంగా ఉన్నారు. రేచీకటితో బాధపడుతున్న వారు రాత్రి భోజనానికి తర్వాత 40 రోజుల పాటు ఎరుపు అరటిని తీసుకుంటే ఈ వ్యాధి నయం అవుతుంది. దంత సమస్యలను దూరం చేసుకోవాలంటే రోజూ ఒక ఎరుపు అరటిని తీసుకోవాలి. అలాగే చర్మ వ్యాధులు, అలెర్జీలకు కూడా ఎరుపు అరటి దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


