స్వచ్ఛసర్వేక్షన్ నిబంధనలు పాటించండి: జీవీఎంసీ
- 102 Views
- wadminw
- December 22, 2016
- Home Slider రాష్ట్రీయం
స్వచ్ఛభారత్, స్వచ్ఛాంద్రప్రదేశ్, స్వచ్ఛసర్వేక్షన్ తాజా నిబంధనలు పాటించడం ద్వారా స్వచ్ఛ విశాఖ లక్ష్యాన్ని చేరుకోవాలని జివియంసి కమీషనర్ హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్లో అందరు ఇంజనీరింగ్ అధికారులు, జోనల్ కమీషనర్లు, ఏ.యం.ఓ.హెచ్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జివియంసి మంజూరు చేసిన నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్లను లబ్దిదారులు సక్రమంగా వినియోగించేలా చూడాలని ఆదేశించారు.
అదేవిధంగా నగరంలోని అన్ని ప్రజామరుగుదొడ్లు, ప్రైవేటు టాయిలెట్లను అన్ని మౌళిక సదుపాయాలను కల్పించి సంతృప్తికరంగా నిర్వహించాలని పేర్కొన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిన లబ్దిదారులకు ఆఖరి చెల్లింపులు ఏమైనా మిగిలి ఉంటే పూర్తిచేయాలని, కలెక్టరేట్ జంక్షన్‌లోని మరుగుదొడ్లు పై ప్రత్యేకశ్రద్ధ వహించాలని, కూడలిలో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌ను తొలగించాలని ఆదేశించారు. మరుగుదొడ్లకు నగరంలోని గోడలకు అతికించిన పోస్టర్లను తొలగించాలని పేర్కొన్నారు.
నగరాన్ని పోస్టర్ రహిత నగరంగా రూపొందించాలని, గోడలకు పోస్టర్లు అతికించడంపై నిషేధం ఉన్నట్లు వివరించారు. పర్యటనలో మూడవ జోనల్ కమీషనర్ వి.చక్రధరరావు, ఇ.ఇ.మహేష్, ఏ.యం.ఓ.హెచ్. డాక్టర్ మురళీమోహన్, ఏసిపి సత్యనారాయణ జోనల్ సిబ్బంది పాల్గొన్నారు. ఓడిఎఫ్ నగరంగా ప్రకటితమైనందున అన్ని వార్డులలో ఓడిఎఫ్ కొనసాగేటట్లు చర్యలు తీసుకుని పర్యవేక్షించాలని అభిలషించారు. స్వచ్ఛభారత్, స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వచ్ఛవిశాఖ లక్ష్యంగా కార్యక్రమాలను నిర్వహించి ఉత్తమ ర్యాంకింగ్ సాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు.
అంకిత భావంతో, నిబద్ధతతో నిబంధనలు పాటించడం ద్వారా లక్ష్యం చేరుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని ముఖ్యమైన ప్రాంతాలు, వ్యాపార కేంద్రాలు, మార్కెట్ల వద్ద ప్రత్యేక శ్రద్ధతో పారిశుద్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో చీఫ్ ఇంజనీర్ డాక్టర్ వి.చంద్రయ్య, సి.యం.ఓ.హెచ్ డాక్టర్ ఏ.హేమంత్, యస్.ఇ. మరియన్న, పిడియుసిడి డి.శ్రీనివాసమ్, సిసిపి సురేష్‌కుమార్, అందరు కార్యనిర్వాహక ఇంజనీర్లు, జోనల్ కమీషనర్లు, ఏ.యం.ఓ.హెచ్లు తదితరులు పాల్గొన్నారు.


