స్వచ్ఛ సర్వేక్షన్లో ఉత్తమ ర్యాంక్ సాధనకు కార్యాచరణ
విశాఖపట్నం, అక్టోబబర్ 4 (న్యూస్‌టైమ్): స్వచ్ఛ భారత్ మిషన్ ద్వితీయ వార్షికోత్సవంలో విశాఖ సిటీ మూడు అవార్డులను అందుకోడానికి, ఓడిఎఫ్ సిటీగా రూపొందించడంలో సహకరించిన అందరు అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పారిశుధ్య కార్మికులకు ప్రజలకు అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు జివియంసి కమిషనర్ హరినారాయణన్ పేర్కొన్నారు. ప్రజారోగ్యశాఖా అధికారులు, సిబ్బంది, ఇంజనీరింగ్ ఆధికారులు, జోనల్ కమిషనర్లతో మంగళవారం ఆయన తన ఛాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓడిఎఫ్గా రూపొందించుకోవడంతో బాటు ఓడిఎఫ్‌ను సంపూర్ణంగా కొనసాగించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎక్కడైనా అవసరమనుకొంటే వ్యక్తిగత, కమ్యూనిటీ మరుగుదొడ్లు నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 2016 లో 5వ ర్యాంక్ సాధించామని, జివియంసిలో చేపడుతున్న స్వచ్ఛ విశాఖ కార్యక్రమాలతో 2017 లో మరింత ఉత్తమ ర్యాంక్ సాధించడానికి కార్యాచరణను అక్టోబరు 15 నాటికి సంసిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. డబ్ల్యూ యస్.యు పి ప్రాజెక్టు మేనేజర్ ఉదయసింగ్, అదనపు కమిషనర్ జనరల్ జివివియస్ మూర్తి కార్యాచరణ, సమన్వయ కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు.
స్వచ్ఛ సిటీ ప్లాన్, నిర్వహించే కార్యక్రమాల చెక్ లిస్టులను రూపొందించి కార్యక్రమాలను అమలు చేయాలని పేర్కొన్నారు. స్వచ్ఛ విశాఖ సాధన కోసం కృషి చేయాలని కోరారు. సమావేశంలో అదనపు కమిషనర్ (జనరల్) జివివియస్ మూర్తి, డబ్ల్యూ యస్ యుపి ప్రాజెక్టు మేనేజర్ ఉదయసింగ్, జోనల్ కమిషనర్లు సత్యవేణి, పి.నల్లనయ్య, వి.చక్రధరరావు, ఎన్.శివాజీ, రమణమూర్తి, రాంమోహన్, షేక్సుబానీ, ఇఇలు వెంకటీ, వేణుగోపాల్, క్రిష్ణారావు, మహేష్, వేణుగోపాలరావు, వి.ఆర్.కె.రాజు, రాంమోహన్, ఏ.యం.ఓ.హెచ్ లు డా.మురళీమోహన్, ఎస్ జయరాం, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


