సర్వరోగ నివారణి త్రిఫల చూర్ణం
ఒక మనిషికి రోగం అంటే ఆయుర్వేద భాషలో వాతం, పిత్తం, కఫం ఈ మూడింటిలో ఏదో ఒకటి ఉందన్నమాట. వీటన్నింటినీ సరిచేసి పూర్తి ఆరోగ్యం ఇవ్వాలంటే అది సర్వరోగ నివారణి త్రిఫల చూర్ణంతోనే సాధ్యం. ఇది ప్రకృతి సిద్ధమైన యాంటీ బైయోటిక్. మన శరీరాన్ని శుభ్రం చేయడంతో మనకు ఎంతగానో ఉపకరించే ఆయుర్వేద ఔషధం త్రిఫల చూర్ణం. ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమమే త్రిఫల చూర్ణం. త్రిఫల చూర్ణాన్ని త్రిదోష రసాయనంగా చెబుతారు. మన శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను ఈ చూర్ణం సరిచేస్తుంది. వాతం నాడీ వ్యవస్థకు, పిత్తం జీవనక్రియలకు, కఫం శరీర నిర్మాణానికి సంబంధించినది. ఈ మూడు కాయలను సమాన పాళ్లలో తీసుకుని గింజలు తీసేసి మెత్తని చూర్ణంగా చేయాలి.
ఈ పౌడర్ని ప్రతి రోజు రాత్రి అర టీస్పూను చొప్పున వేడి నీళ్లతో ఒక నెల వాడాలి. త్రిఫలా చూర్ణాన్ని ఎక్కువ రోజులు వాడితే శరీరం దానికి అలవాటు పడుతుంది. అది మంచిది కాదు. త్రిఫలాలో వాడే కరక్కాయ చాలా శక్తివంతమైనది. అయితే దీనిని ఉపవాసం ఉన్నవారు, గర్భిణులు, శరీరంలో పిత్త దోష గుణం ఉన్నవారు వాడకూడదు. దీనిని త్రిఫలా చూర్ణంతోనే కాక ప్రత్యేకంగా కూడా వాడవచ్చు. పలు రకాల జీర్ణ సంబంధ, శ్వాస సంబంధ వ్యాధులకు ఇది చక్కగా పని చేస్తుంది. దీనిని క్రమబద్ధంగా నోటితో చప్పరిస్తే ఇది అజీర్ణానికి మంచి విరుగుడు. జీర్ణశక్తిని పెంచుతుంది. కరక్కాయతో ఏదైనా ఔషధాన్ని తయారుచేసుకుని వాడుతున్నవారు తప్పనిసరిగా తమ ఆహారంలో ఆవు నెయ్యిని వాడాలి. ఎందుకంటే ఆవు నెయ్యిలో వేడి గుణం హెచ్చుగా ఉంటుంది. త్రిఫల చూర్ణం తగు మాత్రం వాడితే మన శరీరంలోని దోషాలు నివారణ అయిపోతాయి.
ఇదిలావుండగా, మౌత్ అల్సర్లను నోటిపుండ్లు లేదా ఆఫ్తస్ అల్సర్స్ అంటారు. ఇవి చాలా చిన్నవిగా నోటి లోపల వైపు వస్తుంటాయి. ఇది వంశపారంపర్యమైనదీ కాదు, అలా అని ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే సమస్యా కాదు. ఈ మౌత్ అల్సర్ పిల్లల్లోనూ పెద్దల్లోనూ ఇద్దరిలోనూ కనిపిస్తుంటాయి. ఇవి ముఖ్యంగా పెదాల లోపల చర్మానికి అంటి పెట్టుకొని పుండులా ఏర్పడుతూ భయంకరమైన నొప్పి లేదా మంటను కలిగిస్తాయి. అంతే కాదు ఏదైనా ఆహారాన్ని మింగాలన్నా లేదా తాగాలన్నా, చాల పెయిన్ ఫుల్‌గా ఉంటుంది. ఈ రకమైన మౌత్ అల్సర్లు రావడం చాలా సాధారణం. కొన్నిసార్లు దంతాలు నోటి లోపల చర్మానికి గుచ్చుకోవడం, బ్రష్ చేసేటప్పుడు టూత్‌బ్రష్ తగిలి గాయం కావడం, నాలుకను లేదా చెంప లోపలి వైపున పొరపాటున కొరుక్కోవడం, లేదా శరీరం బాగా వేడి చేసినప్పుడు, నోటిని శుభ్రం ఉంచుకోకపోవడం, విటిమిన్స్ లోపం, ఒత్తిడి, నిద్రలోపం, డీహైడ్రేషన్ వంటి కారణంగా ఈ రకమైన అల్సర్లు వస్తుంటాయి.
వీటి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈ నోటి అల్సర్లు ఒక్కసారి వచ్చిందంటే చాలు 24గంటలు నొప్పి, మంటను భరిస్తూనే ఉండాలి. ఎంతటి తీపిపదార్థాలు తిన్నా, నోట్లో కారం వేసినట్టు మంట పుడుతుంది. మొదట కొబ్బరిని తురమాలి. దాని నుంచి పాలు వేరు చేయాలి. టంగ్ అల్సర్ నివారించడానికి ఈ కోకనట్ మిల్క్ నేచురల్ అండ్ సింపుల్ హోం రెమెడీ. ఇలా తీసిన కోకనట్ మిల్క్ ని నోట్లో పోసుకొని గార్గిలింగ్ చేయాలి. టంగ్ అల్సర్ నివారించుకోవడంలో ఇది గ్రేట్ గా పనిచేస్తుంది. ఈ చిట్కాను రోజులో కనీసం మూడు సార్లైనా చేస్తే త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. మౌత్ అల్సర్‌ను నివారించడానికి కొత్తిమీర గ్రేట్ రెమెడీ. కొత్తిమీరను నీటిలో వేసి ఉడికించి ఆ నీటితో గార్గిలింగ్ చేయడం వల్ల మౌత్ అల్సర్ నివారించుకోవచ్చు. ఇన్ఫెక్షన్స్ కూడా నివారిస్తుంది.
హాట్ వాటర్, కోల్డ్ వాటర్‌ను మార్చిమార్చి నోట్లో పోసుకుని గార్గిలింగ్ చేయడం వల్ల మౌత్ అల్సర్ నివారించబడుతుంది. ఇది ఇన్ఫమేషన్ తగ్గిస్తుంది. నీటిలో కొద్దిగా మెంతులను మిక్స్ చేసి ఉడికించాలి. తర్వాత ఆ నీటిని వడగట్టి, గోరువెచ్చగా చేసి నోట్లో పోసుకుని గార్గిలింగ్ చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్‌గా సమస్యను నివారిస్తుంది. అలోవెర ఎఫెక్టివ్ నేచరల్ హోం రెమెడీ. అలోవెర జెల్‌ను రెండు టేబుల్ స్పూన్స్ రోజులో మూడుపూటలా తీసుకోవడం వల్ల మౌత్ అల్సర్ తగ్గించుకోవచ్చు. అదే విధంగా, తులసిలోని ఔషధగుణాలపై చేసిన పరిశోధనల్లో ఇందులో నోటి అల్సర్లను తగ్గించే లక్షణం కూడా ఉందని నిరూపితమైనది.
దీనికోసం కొన్ని తులసి ఆకులను తీసుకొని, రోజుకు నాలుగైదు సార్లు వీటిని నమలడం వల్ల సులభంగా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆకులను నమిలేటప్పుడు వాటికి కొన్ని నీళ్లు కూడా జతచేస్తే ఆ ద్రావణం నోరంతా వ్యాపించి, సమస్యను త్వరగా తగ్గిస్తుంది. పచ్చిటమోటోలు ముక్కలు ఒకటి తినాలి లేదా 5 బేబీ టమోటోలను తింటుండాలి. వీటిని తినేటప్పుడు నిధానంగా మౌత్ అలర్స్ ఉన్న ప్రక్క కాకుండా రెండో పక్క బాగా నమిలి ఆ జ్యూసును నోట్లో ఉండేలా తినాలి.


