హంద్రీనీవా పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
- 134 Views
- wadminw
- September 3, 2016
- రాష్ట్రీయం
అనంతపురం: ‘హంద్రీనీవా పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఏ దశలోనూ నత్తనకన సాగొద్దు. నిర్లక్ష్యం కనిపించకూడదు. నిర్దేశిత లక్ష్యంలోగా పనులు పూర్తి కావాలి. గుత్తేదారులు, ఇంజనీర్లు నిర్లిప్తత ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని’ జిల్లా జలవనరుల శాఖ సీఈ జలంధర్ అన్నారు. హెచ్చెల్సీ ఎస్ఈ కార్యాలయంలో శాఖ జిల్లా ముఖ్య అధికారుల సమావేశం జరిగింది. సీఈతోపాటు ఎస్ఈలు సుధాకర్‌బాబు, టీవీ శేషగిరిరావు, బీవీ సుబ్బారావు, ఈఈలు రాజాస్వరూప్‌కుమార్, వెంకట్రమణారెడ్డి తదితరులు హాజరయ్యారు.
హంద్రీనీవా పనులు, నీరు-చెట్టు పనులు, హెచ్చెల్సీ ఆధునీకరణ ప్రక్రియపై చర్చించారు. జిల్లాకు కృష్ణా జలాలే శరణ్యమని, అయితే హెచ్చెల్సీ వాటా గణనీయంగా తగ్గుతోందన్నారు. తుంగభద్ర ఎగువన వర్షాభామూ ఇందుకు కారణమన్నారు. అందుకే కృష్ణా జలాలను వీలైనన్ని జిల్లాకు తరలించాలంటే హంద్రీనీవా కాలువలు పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అక్టోబరు నాటికి జిల్లాలో పనులన్నీ పూర్తయ్యేలా చూడాలన్నారు. గొల్లిపల్లి రిజర్వాయర్ అక్టోబరు నాటికి పూర్తి చేద్దామన్నారు.


