హాకీ టీమ్ గోల్‌కీపర్‌గా విద్యార్థి ఎంపిక
తమిళనాడులో ఈ నెల 27 నుంచి జరగనున్న దక్షిణ భారత అంతర విశ్వవిద్యాలయాల హాకీ టోర్నీలో పాల్గొననున్న జేఎన్టీయూ (కాకినాడ) జట్టుకు గోల్ కీపర్‌గా జీవీఐటీ విద్యార్థి చిక్కం జగదీష్పవన్కుమార్ ఎంపికైనట్లు ప్రిన్సిపల్ ప్రసాద్ మంగళవారం తెలిపారు. కళాశాల ఛైర్మన్ గ్రంధి వెంకట్రావు, కార్యదర్శి సురేష్, సంయుక్త కార్యదర్శి ఆరేటి కాశీ, డైరెక్టర్ వైవీఎస్ అప్పారావు, అధ్యాపకులు విద్యార్థిని అభినందించినట్లు చెప్పారు.
మరోవైపు, ఈనెల 17, 18 తేదీల్లో కాకినాడలో నిర్వహించిన అంతర జిల్లాల ఈత పోటీల్లో జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు బహుమతులు సాధించారని డీఎస్డీవో అజీజ్ ఒక ప్రకటనలో తెలిపారు. కేవీఆర్ కిషోర్, పి.సాయిఅక్షిత, పి.రఘురాం, బి.విష్ణువర్థన్, కె.భుషి బహుమతులు సాధించారని చెప్పారు.
Categories

Recent Posts

