హార్డ్‌కాపీలు వెంటనే అందజేయండి: కిషన్ యాదవ్
ఆదిలాబాద్, డిసెంబర్ 14 (న్యూస్‌టైమ్): 2014-15,2015-16 విద్యా సంవత్సరంలో ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల హార్డ్ కాపీలను సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు వెంటనే అందజేయాలని దళిత అభివృద్ధి శాఖ అధికారి కిషన్‌యాదవ్ పేర్కొన్నారు.
2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లావ్యాప్తంగా 421 మంది ఎస్సీ విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారని ఇందులో 251 ఆధార్ కార్డు గుర్తింపు నమోదు కాకుండా పెండింగ్‌లో ఉండడం వల్ల ఆ విద్యార్థుల ఉపకార వేతనాలు అందించలేపోతున్నామని అన్నారు. వెంటనే ప్రధానోపాధ్యాయులు, ప్రన్సిపాళ్లు రెండు, మూడు రోజుల్లో హార్డ్ కాపీలను అందించి విద్యార్థుల చదువులు ముందుకుసాగేలా కృషి చేయాలని అన్నారు.
Categories

Recent Posts

